ఎన్టీఆర్ 30 షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేసే పనిలో వున్నారు సినిమా యూనిట్. అందులో భాగంగా ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈసినిమా వచ్చే వారం నుండి మూడో షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకోనుంది.మొదటి రెండు షెడ్యూల్స్ లో యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయగా మూడో షెడ్యూల్ కూడా ఫైట్ సీన్స్ ను చిత్రీకరించనున్నారట. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ జరుగనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆల్రెడీ వీరిద్దరూ ఈసినిమా షూటింగ్ లోకూడా పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ మిక్కిలినేని,హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న తెలుగుతోపాటుహిందీ,కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో విడుదలకానుంది.ఇదిలావుంటే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్30 నుండి అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదలచేయనున్నారని టాక్.మరో వైపు బర్త్ డే సందర్బంగా ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ సింహాద్రి రీ రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: