ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా.. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి ఈసినిమాలో నటిస్తున్న అజయ్ చేసిన కామెంట్స్. ఈసినిమా కథ కథనాల పరంగా కానీ, ఎలివేషన్స్ పరంగా కానీ దేవర ది బెస్ట్ గా ఉండబోతుంది అని.. అలాగే ఈ ఏడాదిలో రానున్న సినిమాల్లో కూడా ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది అని తెలిపాడు. అజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో జోష్ ను పెంచాయి. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: