
ట్యాగ్ · 28 కథనాలు


మనమే లో చివరి ఆ 40నిమిషాలు

శర్వా 35 నుండి కృతిశెట్టి స్పెషల్ వీడియో

హాయ్ నాన్న మ్యూజికల్ గాలా మొదలు

తమిళ్ లో ఖుషి కొత్త రికార్డ్

బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న ఖుషి

హాయ్ నాన్న షూటింగ్ అప్డేట్

మొదటి రోజు సత్తా చాటిన ఖుషి

రివ్యూ :ఖుషి

సెన్సార్ పూర్తి చేసుకున్న ఖుషి

నెంబర్ 1 ట్రెండింగ్ లో ఖుషి ట్రైలర్

ఖుషి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

ఖుషి ట్రైలర్ రిలీజ్

మహేష్ బిజినెస్ మేన్ తో ఖుషి ట్రైలర్

ఖుషి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మనమే నుండి ఫోర్త్ సింగిల్ రిలీజ్
టాలీవుడ్ డైనమిక్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ల్యాండ్‌మార్క్ మూవీ 'మనమే'. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది హీరో శర్వానంద్కు 35వ చిత్రం కావడం విశేషం. ఇక ఇందులో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‍గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మనమే లో చివరి ఆ 40నిమిషాలు
రెండేళ్ల గ్యాప్ తరువాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు హీరో శర్వానంద్.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ మనమే.కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు.ప్రమోషన్స్ తో బాగానే సౌండ్ చేస్తుంది.టీం అయితే సూపర్ కాన్ఫిడెంట్ గా వుంది. శతమానం భవతి తరహాలో శర్వా కెరీర్ లో మనమే ఓ మంచి సినిమా అవుతుందని అంటున్నారు.ట్రైలర్ కూడా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.సెన్సార్ బోర్డు కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిందట.ఇక ఇండస్ట్రీలోని దగ్గరివాళ్లకు సినిమాను చూపెట్టగా వారు కూడా అదిరిపోయిందని అంటున్నారు.

ఓటీటీలోకి వస్తున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటించిన రొమాంటిక్ చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్ల కలెక్షన్స్ సహా మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్' భారీ అంచనాలతో వచ్చి ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఖుషి' వంటి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆయన ఈసారి సరైన హిట్‌ను అందుకున్నాడు. అలాగే మరోవైపు నటి సమంత కూడా 'శాకుంతలం' పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

శర్వా 35 నుండి కృతిశెట్టి స్పెషల్ వీడియో
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కృతిశెట్టి. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో అలరించింది. ఇక ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కృతిశెట్టికి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోల పక్కన జతకట్టేసింది కృతిశెట్టి. అయితే కృతిశెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెెళుతుది కానీ ఈమధ్య కాలంలో సరైన హిట్ మాత్రం పడలేదు. ఈ ఏడాది కస్టడీ రిలీజ్ అయింది ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. తన కొత్త సినిమాలతో హిట్ కొట్టాలని చూస్తుంది.

హాయ్ నాన్న-సమయమా సాంగ్ ప్రోమో రిలీజ్
శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

హాయ్ నాన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని నుండి రాబోతున్న సినిమా హాయ్ నాన్న. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దసరా సినిమాలో ఊర మాస్ పాత్రలో కనిపించగా ఇప్పుడు సాఫ్ట్ పాత్రతో వస్తున్నాడు. అంతేకాదు ఈసారి తండ్రి పాత్రలో అలరించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ ను అలాగే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఖుషి దూసుకుపోతున్న యూఎస్ఏ కలెక్షన్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సెప్టెంబర్ 1న రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఇంకా లవ్, కామెడీ యాంగిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది.

హాయ్ నాన్న మ్యూజికల్ గాలా మొదలు
ఈ ఏడాది దసరా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసినిమాలో నాని తండ్రి పాత్రలో నటించబోతున్నాడు. ఈసినిమా షూటింగ్ ను చిత్రయూనిట్ ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకునే పనిలో పడింది.

తమిళ్ లో ఖుషి కొత్త రికార్డ్
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సినిమా రిలీజ్ కు ముందు నుండే ఈక్రేజీ కాంబినేషన్ పై అందరికీ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈసినిమా పాటలు సినిమాపై హైప్ ను మరింత పెంచేశాయి. ఇక రిలీజ్ అయిన తరువాత కూడా వీరిద్దరి కెమిస్ట్రీకే మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక లవ్, కామెడీ, ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అందరినీ ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 'ఖుషి' మూవీ టీమ్
టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ 'ఖుషి' మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండలతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. అలాగే 'ఖుషి' చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మరియు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు, పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న ఖుషి
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుండడం తో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 70.23కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.గీత గోవిందం తరువాత 100కోట్ల క్లబ్ లో చేరడం విజయ్ కు ఇది రెండో సారి కానుంది.

హాయ్ నాన్న షూటింగ్ అప్డేట్
ఈసమ్మర్ లో దసరాతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు న్యాచురల్ స్టార్ నాని.రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.నాని కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల సినిమా.ఇక ఈసినిమా తరువాత నాని నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న.కేవలం గ్లింప్స్ తోటే సినిమాకు హైప్ తెప్పించింది చిత్ర బృందం.ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాఫై అంచనాలను పెంచేసింది.ఇక ఈరోజు నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. కూనూర్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.

మొదటి రోజు సత్తా చాటిన ఖుషి
విజయ్ దేవరకొండ, సమంత ల ఖుషి నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తో పాటు సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 30.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో 10కోట్ల షేర్ ను రాబట్టింది.ఈరోజు,రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి. దాంతో ఈ వారాంతంలో ఖుషి 50కోట్ల క్లబ్ లోకి చేరుకోనుంది. అయితే ఈసినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.ఆ మార్క్ ను చేరుకువాలంటే ఓవరాల్ గా 50కోట్ల షేర్ ను రాబట్టాల్సివుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఫుల్ రన్ లో ఈ టార్గెట్ ను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

రివ్యూ :ఖుషి
ఓవరాల్ గా ఖుషిలో విజయ్ దేవరకొండ ,సమంత నటన అలాగే చివరి 30నిమిషాలు,సాంగ్స్ హైలెట్ అయ్యాయి.ఇక విజయ్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ను కూడా ఈ ఖుషి ఇచ్చేసింది.ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమా చూసేయొచ్చు.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఖుషి
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ అదరగొట్టింది.ప్రస్తుతం విజయ్ ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా విడుదలవుతుండడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది.అయితే ఖుషికి రన్ టైం కొంచెం ఎక్కువగానే వుంది.దాదాపు 2గంటల 45నిమిషాల నిడివితో రానుంది.

నెంబర్ 1 ట్రెండింగ్ లో ఖుషి ట్రైలర్
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. అందుకే ఈసినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీలవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విజయ్-సమంత ల మధ్య కెమిస్ట్రీని చూడాలని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఖుషి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
విజయ్ దేవరకొండ,సమంత కలిసి నటించిన ఖుషి మరో మూడు వారాల్లో థియేటర్లోకి రానుంది.పోస్టర్లు ,సాంగ్స్ సినిమాఫై హైప్ క్రీయేట్ చేయగా నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది.యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఖుషి,విజయ్ కి కావాల్సిన విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇక ఈట్రైలర్ 24గంటల్లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

ఖుషి ట్రైలర్ రిలీజ్
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కావడంతో సినిమాఫై హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా వుంది.విప్లవ్,ఆరాధ్యల ప్రేమ ఆతరువాత వారి వైవాహిక జీవితం చుట్టూ తిరిగే కథతో వస్తుంది ఖుషి.విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ,ఆరాధ్య పాత్రలో సమంత నటించారు.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ కానుంది.ట్రైలర్ లో మాత్రం విజయ్,సమంత ల లుక్ అదిరిపోయింది.విజువల్స్ చాలా బాగున్నాయి.ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి విజయ్ మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.

మహేష్ బిజినెస్ మేన్ తో ఖుషి ట్రైలర్
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శివ నిర్వాణ ఎక్పర్ట్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఖుషి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లను బట్టి విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈసినిమా అప్ డేట్స్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నా రోజా నువ్వే పాట, ఆరాధ్య పాట, ఖుషి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా మూడు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.