నటీనటులు : విజయ్ దేవరకొండ,సమంత,వెన్నెల కిషోర్
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగఫ్రీ : మురళీవర్ధన్
సంగీతం : హేషమ్ అబ్దుల్ వాహబ్
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ,సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఖుషి.ఇద్దరు స్టార్లు ఉండడంతో పాటు సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం,ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాఫై అంచనాలు భారీగా పెరిగాయి.ఇక విజయ్ కి హిట్ చాలా అవసరం.మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఖుషి అంచనాలను అందుకుందా? విజయ్ కి కావలసిన విజయాన్ని అందించిందా లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ :
విప్లవ్ (విజయ్ దేవరకొండ) కాశ్మీర్ లో ఆరాధ్య (సమంత)ను చూసి మనసు పారేసుకుంటాడు.అయితే ఆరాధ్య ముస్లిం అమ్మాయి అనుకుని ఇంప్రెస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు.ఈక్రమంలో ఆరాధ్యే నేను ముస్లిం కాదు బ్రాహ్మణ అమ్మాయిని అని చెప్తుంది.ఆతరువాత విప్లవ్,ఆరాధ్యకు కొన్ని విషయాల్లో సహాయం చేయడంతో తను కూడా విప్లవ్ ను ఇష్ట పడుతుంది.ఇక విప్లవ్ నాన్న లెనిన్ సత్యం( సచిన్ కెడ్కర్) నాస్తికుడు.అయితే ఎలాగోలా విప్లవ్,ఆరాధ్య ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఆతరువాత వారి కుటుంబాల మధ్య అలాగే వైవాహిక జీవితంలో వచ్చిన ఇబ్బందులు ఏంటి వాటిని ఏ విధంగా పరిష్కరించుకున్నారు అనేది మిగితా కథ.
విశ్లేషణ :
కథ చాలా సింపుల్ ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాక భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్థలు ఏంటి ? ఆతరువాత వాటిని ఎలా పరిష్కరించుకున్నారు ఇంతే అయితే దీన్ని ఆసక్తికరమైన కథనంతో తెరమీదకు తీసుకొచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ.ఎమోషనల్ ఎంటర్టైనర్ లను డీల్ చేయడంలో శివ నిర్వాణకు మంచి పట్టు వుంది.ఈసినిమాలో కూడా తన బలాన్ని మరో సారి రిపీట్ చేశాడు.
కథలోకి వెళ్ళడానికి పెద్దగా టైం తీసుకోలేదు డైరెక్టర్.ఉద్యోగంలో భాగంగా విప్లవ్ కాశ్మీర్ రావడం అక్కడ ఆరాధ్యను చూసి ప్రేమలో పడడం ఆతరువాత ఆరాధ్య కూడా విప్లవ్ ను ప్రేమించడం,ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అందులో వచ్చే కామెడీతో సరదాగా సాగిపోద్ది.ముఖ్యంగా కాశ్మీర్ అందాలు అలాగే సాంగ్స్ మెప్పిస్తాయి.ఇక సెకండ్ హాఫ్ లో ఇద్దరి వైవాహిక జీవితంలో వచ్చే గొడవలు ఆతరువాత వాటిని ఎలా పరిష్కరించుకొని కలిసిపోతారు అనేది చూపెట్టారు.
ముఖ్యంగా చివరి 30నిమిషాలు సినిమాను నిలబెట్టింది.ఎమోషనల్ సాగుతూ హృదయానికి హత్తు కుంటుంది.లీడ్ పెయిర్ యాక్టింగ్ తో పాటు పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.ఆరాధ్య సాంగ్ తెర మీద మరింత అందంగా కనబడింది.ఓవరాల్ గా చాలా రోజుల తరువాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది అని చెప్పొకొచ్చు.ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈసినిమాకు బాగా కనెక్ట్ అవుతుంది.
ఇక నటీనటులు విషయానికి వస్తే విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ అదరగొట్టాడు. పక్కింటి కుర్రాడు పాత్ర విజయ్ కు చాలా బాగా సూట్ అవుతుంది ఈసినిమాలో కూడా అలాంటి పాత్రే కావడంతో విజయ్ ఎక్కడా తగ్గలేదు.అలాగే ఆరాధ్య పాత్రలో సమంత ఆకట్టుకుంది.తెర మీద చాలా అందంగా కనబడింది. విజయ్,సమంత కెమిస్ట్రీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరు అదరగొట్టారు.ఇక మిగితా పాత్రల్లో నటించిన మురళీ శర్మ ,రోహిణి,వెన్నెల కిశోర్,రాహుల్ రామకృష్ణ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్ విషయానికి వస్తే డైరెక్టర్ గా శివ నిర్వాణ తన డ్యూటీ చేశాడు. మంచి స్టోరీ తో ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.సంగీతం సినిమాకు మరో హైలైట్ అని చెప్పొచ్చు.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన సాంగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణ గా నిలిచాయి.బీజీఎమ్ కూడా బాగుంది.సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది.విజువల్స్ కలర్ఫుల్ గా వున్నాయి.ఎడిటింగ్ డీసెంట్ గా వుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువల గురించి చెప్పేదేం వుంది మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు.
ఓవరాల్ గా ఖుషిలో విజయ్ దేవరకొండ ,సమంత నటన అలాగే చివరి 30నిమిషాలు,సాంగ్స్ హైలెట్ అయ్యాయి.ఇక విజయ్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ను కూడా ఈ ఖుషి ఇచ్చేసింది.ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమా చూసేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: