న్యాచురల్ స్టార్ నాని నుండి రాబోతున్న సినిమా హాయ్ నాన్న. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దసరా సినిమాలో ఊర మాస్ పాత్రలో కనిపించగా ఇప్పుడు సాఫ్ట్ పాత్రతో వస్తున్నాడు. అంతేకాదు ఈసారి తండ్రి పాత్రలో అలరించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ ను అలాగే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ ను ఒకపక్క పూర్తి చేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా మ్యూజికల్ గాలా ను షురూ చేస్తున్నట్టు తెలిపారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. సమయమా అంటూ వచ్చే ఈ ఫస్ట్ సింగిల్ ను సెప్టెంబర్ 16వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈపాటను రిలీజ్ చేయనున్నాారు.
𝐇𝐢……
September 16th…
Fall in love ♥️#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame #HiNanna pic.twitter.com/S43Kd0uWZM— Nani (@NameisNani) September 14, 2023
ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.