శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా మ్యూజిక్ గాలాను మొదలుపెట్టేశారు చిత్రబృందం. ఖుషి కి సూపర్ ఆల్బమ్ ఇచ్చిన హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తుడటంతో ఈసినిమా పాటలపై కూడా ఇప్పటినుండే ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈసినిమా నుండి సమయమా అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాటను సెప్టెంబర్ 16వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. రేపు ఉదయం 11:07 గంటలకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాటను రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. జస్ట్ ట్యూన్ తోనే ఉన్న ప్రోమోను చూస్తుంటే ఈపాట కూడా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది అన్నట్టు అర్థమవుతుంది.
Tomorrow 🙂#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame#HiNanna pic.twitter.com/zYpkVQ1Kp9
— Nani (@NameisNani) September 15, 2023
ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: