శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. అందుకే ఈసినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీలవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విజయ్-సమంత ల మధ్య కెమిస్ట్రీని చూడాలని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు ఇంకా నా రోజా నువ్వే, ఆరాధ్య, ఖుషి టైటిల్ సాంగ్స్ అన్నీ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఇక దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్సే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం 25 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ 1 ట్రెండింగ్ లో నిలుస్తుంది. చిత్రయూనిట్ ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
Every action in a relationship has an equal and opposite reaction from the partner 😅❤️#KushiTrailer Trending #1 on YouTube with 25M+ views 💥
– https://t.co/jeb2xb0XAr#Kushi in cinemas from SEP 1st ❤🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic… pic.twitter.com/5BSAUKGLpD— Mythri Movie Makers (@MythriOfficial) August 12, 2023
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: