శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లను బట్టి విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈసినిమా అప్ డేట్స్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా మూడు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నా రోజా నువ్వే పాట, ఆరాధ్య పాట, ఖుషి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా మూడు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఈసినిమా ట్రైలర్ రెడీ అయిందని తెలిపాడు. ఇప్పుడు ఈవిషయాన్ని మరోసారి కన్ఫామ్ చేశాడు. ఈసినిమా ట్రైలర్ ను ఆగష్ట్ 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ట్రైలర్ 2 నిమిషాల 41 సెకన్లు ఉంటుందని తెలిపాడు.
It’s here. This Aug 9th.
2 mins 41 secs of #KushiTrailer ❤️#Kushi Releasing worldwide September 1! pic.twitter.com/g4B9fuZNiv— Vijay Deverakonda (@TheDeverakonda) August 7, 2023
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: