ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కృతిశెట్టి. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో అలరించింది. ఇక ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కృతిశెట్టికి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోల పక్కన జతకట్టేసింది కృతిశెట్టి. అయితే కృతిశెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెెళుతుది కానీ ఈమధ్య కాలంలో సరైన హిట్ మాత్రం పడలేదు. ఈ ఏడాది కస్టడీ రిలీజ్ అయింది ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. తన కొత్త సినిమాలతో హిట్ కొట్టాలని చూస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు కృతిశెట్టి పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి అప్ డేట్లను ఇస్తున్నారు మేకర్స్. కృతిశెట్టి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో శర్వానంద్ 35 సినిమా కూడా ఒకటి. ఇప్పటికే కృతి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా తాజాగా ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. సెట్స్ లో షూటింగ్ కు సంబంధించి విజువల్స్ తో రిలీజ్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది.
కాగా ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి హేషం అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: