మనమే నుండి ఫోర్త్ సింగిల్ రిలీజ్

Manamey 4th Single Boom Boom Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sharwanand,Krithi Shetty,Seerat Kapoor,TG Vishwa Prasad,Sriram Adittya,Sharwanand Movies,Sharwanand New Movie,Sharwanand Latest Movie,Sharwanand Manamey Movie,Manamey,Manamey Movie,Manamey Telugu Movie,Hesham Abdul Wahab,Manamey Movie Songs,Manamey Telugu Movie Review,Manamey Songs,Manamey Telugu Movie Songs,Manamey Movie Updates,Boom Boom Lyric Video,Boom Boom Lyrical,Boom Boom Lyric Video Song,Boom Boom Lyrical Song,Boom Boom Lyrical Video,Boom Boom Lyrical Video Song,Boom Boom,Boom Boom Song,Boom Boom Video Song,Manamey Boom Boom Song,Manamey Boom Boom Lyric Video,Latest Telugu Songs 2024

టాలీవుడ్ డైనమిక్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ల్యాండ్‌మార్క్ మూవీ ‘మనమే’. రొమాంటిక్ ప్లస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది హీరో శర్వానంద్కు 35వ చిత్రం కావడం విశేషం. ఇక ఇందులో ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‍గా నటిస్తుండగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం, జూన్ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్ అన్నీ కూడా సినిమాపై మంచి ఫీల్ క్రియేట్ చేశాయి. అలాగే ‘నా మాటే’, ‘మనమే’, ‘టప్పా టప్పా’ అనే మూడు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘మనమే’ నుండి ఫోర్త్ సింగిల్ రిలీజ్ అయింది.

‘బూమ్ బూమ్’ అంటూ సాగే ఈ పాట పార్టీ నేపథ్యంలో ఫుల్ జోష్‌తో సాగుతుంది. శర్వానంద్, సీరత్ కపూర్ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇక ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. హేమచంద్ర ఆలపించారు. మరోవైపు మనమే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ అందించింది. అలాగే ఈ చిత్రం 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది. కాగా ఈ సినిమాకు ‘నాన్న’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా.. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయిన నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.