విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ అదరగొట్టింది.ప్రస్తుతం విజయ్ ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా విడుదలవుతుండడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది.అయితే ఖుషికి రన్ టైం కొంచెం ఎక్కువగానే వుంది.దాదాపు 2గంటల 45నిమిషాల నిడివితో రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
It's a U/A for #Kushi ❤🔥
September 1st is your family date in cinemas ❤️
9 days to go 💥
– https://t.co/jeb2xb0XAr@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/PKCCn4mCWY
— Mythri Movie Makers (@MythriOfficial) August 23, 2023
నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయగా సమంత హీరోయిన్ గా నటించింది.మురళి శర్మ,రాహుల్ రామకృష్ణ,వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.వచ్చే నెల 1న ఖుషి థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమా విజయం విజయ్ కి కీలకం కానుంది.గీత గోవిందం తరువాత విజయ్ మళ్ళీ ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయాడు.గత ఏడాది లైగర్ అయితే తీవ్రంగా నిరాశపరిచింది.అయితే విజయ్ మాత్రం ఖుషి తనకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తుందని నమ్మకంగా వున్నాడు.మరి ఖుషితో విజయ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: