
ట్యాగ్ · 38 కథనాలు


సూపర్ హీరో "థోర్ "కి సాయి తేజ్ ప్రమోషన్

#SD15'.. మిస్టికల్ క్యాప్చర్..!

హ్యాపీ బర్త్ డే సార్..!

సాయి తేజ్ బ్యాక్ టు షూట్.. #SD15 షూటింగ్ ప్రారంభం..!

సాయి తేజ్ బ్యాక్ టు వర్క్

'రిపబ్లిక్' చూస్తున్న సాయి తేజ్

మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు

"గని"మూవీ టీజర్ పై సాయి తేజ్ ట్వీట్

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆన్ లైన్ చీటింగ్.. మెగా హీరో ఫైర్

పులి పిల్లలతో సాయి తేజ్

'రిపబ్లిక్' టీజర్ రిలీజ్
షూటింగ్ పూర్తి చేసుకున్న సాయి తేజ్ 'రిపబ్లిక్'
'రిపబ్లిక్' రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో సాయి తేజ్ పై నభా నటేష్ ప్రశంసలు
"సోలో బ్రతుకే సో బెటర్" సక్సెస్ మీట్

సత్యదేవ్ 'కృష్ణమ్మ' టీజర్ రిలీజ్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన పాత్రల ద్వారా నటన ద్వారా టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. మొదట హీరో ఫ్రెండ్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసినా ఆతరువాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి.. ఆ తరువాత హీరోగా విభిన్నమైన పాత్రలు చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో కృష్ణమ్మ సినిమా కూడా ఒకటి. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి…

సూపర్ హీరో "థోర్ "కి సాయి తేజ్ ప్రమోషన్
హాలీవుడ్ లో సూపర్ హీరో ఫ్రాంఛైజీ `థోర్` ఈ కేటగిరీలో పెద్ద సక్సెసైంది. థోర్ కి నేటితరం కిడ్స్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.ఇక థోర్ కి ఉన్నట్టే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి కూడా కిడ్స్ లో కొంత ఫాలోయింగ్ ఉంది. అతడి మ్యాన్ లీ నెస్ .. మంచితనం అన్ని జనరేషన్ల వారికి నచ్చుతుంది. అందుకేనేమో.. ఇప్పుడు థోర్ కి సాయి తేజ్ ప్రమోషన్ చేస్తున్నారు.

#SD15'.. మిస్టికల్ క్యాప్చర్..!
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో మొదలవ్వాలి. అయితే కరోనా వల్ల కొంత కాలం లేట్ అయితే ఆతర్వాత సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో మొత్తానికి బ్రేక్ పడింది. సాయి తేజ్ పూర్తిగా కోలుకొని తిరిగి సెట్స్ పైకి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చిత్రయూనిట్ సాయి తేజ్ కు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చారు. ఆయనకు పూలాభిషేకంతో యూనిట్ సభ్యులు స్వాగతం కూడా పలికారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

హ్యాపీ బర్త్ డే సార్..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దేవకట్టా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవకట్టా.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ తరువాత పలు సినిమాలు చేశాడు. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. కానీ రీసెంట్ గా వచ్చిన రిపబ్లిక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక నేడు దేవకట్టా తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి.

సాయి తేజ్ బ్యాక్ టు షూట్.. #SD15 షూటింగ్ ప్రారంభం..!
మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. ఇటీవల హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలపై రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందో ఈసినిమాలో చూపించాడు. ఇక ఈసినిమా తరువాత కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా.

సాయి తేజ్ బ్యాక్ టు వర్క్
సూపర్ హిట్ "పిల్లా నువ్వు లేని జీవితం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి తేజ్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. లవ్ .. మాస్ యాక్షన్ .. కామెడీ ప్రధానమైన కథలకు స్పెషలిస్ట్ గా మారిన సాయితేజ్ కరోనా ప్రభావం వలన .. ఆ తరువాత రోడ్డు ప్రమాదానికి గురికావడం వలన సినిమాలకు దూరం అయ్యారు.ఇప్పుడు సినిమాలకు సిద్ధం అయ్యారు.

'రిపబ్లిక్' చూస్తున్న సాయి తేజ్
దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వచ్చిన సినిమా రిపబ్లిక్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అయితే ఈసినిమా రిలీజ్ అయినప్పుడు సాయి తేజ్ పరిస్థితి అంత బాలేదన్న సంగతి తెలిసిందే. అప్పటికే సాయితేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై చికిత్స తీసుకుంటున్నాడు. దీనివల్ల సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేకపోయాడు. అయితే మేకర్స్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈసినిమా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది

మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు
మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే కదా. దాదాపు 40 రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో ఉండి సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవలే తాజాగా మెగా హీరోలందరితో కలిసి దీపావళి పండుగ రోజు సాయి తేజ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇక తాజాగా సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా వాయిస్ మెసేజ్ ఇచ్చి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ వాయిస్ మెసేజ్ లో ''హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిశాక నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు. ‘రిపబ్లిక్’ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు…

"గని"మూవీ టీజర్ పై సాయి తేజ్ ట్వీట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ డిసెంబర్ 3 వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ టైమ్ బాక్సర్ గా నటించిన వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ ” దబాంగ్ 3″ మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా సాయి తేజ్ ప్రమాదానికి గురికావడం తో పోస్ట్ పోన్ అయ్యింది. సాయితేజ్ కోలుకోవడం తో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .

"రిపబ్లిక్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ప్రస్థానం"మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , ఐశ్వర్య రాజేష్ జంటగా పొలిటికల్ థ్రిల్లర్ "రిపబ్లిక్ "మూవీ తెరకెక్కింది. జగపతి బాబు , రమ్య కృష కీలక పాత్రలలో నటించగా , సుబ్బరాజు , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆన్ లైన్ చీటింగ్.. మెగా హీరో ఫైర్
టెక్నాలజీ పెరగడంతోపాటు ఆన్ లైన్ మోసాలు కూడా బాగా పెరిగిన సంగతి తెలిసిందే కదా. ఇలాంటి మోసాలు పాల్పడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు.. మోసపోయేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇక సెలబ్రిటీల పేరుతో జరిగే మోసాలు అయితే అనేకం. రీసెంట్ గానే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములను ఒక ఆన్ లైన్ స్కామర్ అవార్డ్ వచ్చిందంటూ దానికి రిజిస్టర్ చేసుకోవాలంటూ డబ్బులు ట్రాన్ఫర్ చేయాలంటూ అడుగగా.. వెంకీ కూడా చేశాడు. ఆ తరువాత కానీ అర్ధకాలేదు తను మోసపోయానని.. ఇప్పుడు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమంటున్నాడు మెగాహీరో సాయి తేజ్. అయితే తను మోసపోలేదులే కానీ తన పేరు చెప్పుకొని పాల్పడుతున్నారంటూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాడు.

పులి పిల్లలతో సాయి తేజ్
"చిత్రలహరి ", "ప్రతి రోజూ పండగే ", "సోలో బ్రతుకే సో బెటర్ "వంటి వరస సక్సెస్ ఫుల్ మూవీస్ తో హీరో సాయి తేజ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో సాయి తేజ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ "రిపబ్లిక్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ తో ఆకట్టుకున్న "రిపబ్లిక్ "మూవీ జూన్ 4వ తేదీ రిలీజ్ కానుంది.

'రిపబ్లిక్' టీజర్ రిలీజ్
మెగాహీరో సాయి తేజ్ ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సూపర్ ఫాంలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. 'రిపబ్లిక్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌కి మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సాయి తేజ్, రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ లను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. అవికూడా బాగా ఆకట్టుకున్నాయి.

'రిపబ్లిక్' - రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్
దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. భారతదేశం స్వా తం త్య్రాన్ని సాధించి 74 ఏళ్లు అవుతుంది. డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు మనకు అంటూ ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వాటిలోని లోపాలను చూపించేలా సినిమా తీస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రీసెంట్ గానే సాయి తేజ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 5న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే…

'రిపబ్లిక్' తేజ్ లుక్ రిలీజ్ చేసిన చరణ్
ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డ సాయి తేజ్ ఇప్పుడు వరుస హిట్స్ తో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రతీ రోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో వరస హిట్స్ అందుకొని మంచి ఫాంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వాటిలోని లోపాలను చూపించేలా సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న సాయి తేజ్ 'రిపబ్లిక్'
కొంతకాలం ప్లాప్స్ తో సతమతమైన సాయి తేజ్ ఆ తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. వెంటనే ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల హిట్స్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
'రిపబ్లిక్' రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మెగా స్టార్ ఆచార్య, పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', రామ చరణ్ ఆర్ఆర్ఆర్, వరుణ్ తేజ్ గని, అల్లు అర్జున్ పుష్ప, వైష్ణవ్ తేజ్ ఉప్పెన ఇలా ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక సాయి తేజ్ కొత్త సినిమా కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే లాక్ డౌన్ తీసిన తర్వాత థియేటర్ లో తన మొదటి సోలో బ్రతుకే సో బెటర్ సినిమానే వేసాడు. ఇక ఆ సినిమా కూడా మంచి టాక్ ను, కలెక్షన్స్ ను సొంతం చేసుకొని తర్వాత థియేటర్ లో సినిమా రిలీజ్ చేయాలనుకున్న వారికి మంచి బూస్ట్ ఇచ్చింది.
హీరో సాయి తేజ్ పై నభా నటేష్ ప్రశంసలు
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్"సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ భారీ అంచనాలతో థియేటర్స్ లో డిసెంబర్ 25 వ తేదీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. కరోనా భయాన్ని వెనుకకు నెట్టి ప్రేక్షకాదరణతో "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ 50 శాతం ఆక్యుపెన్సీ తో రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
"సోలో బ్రతుకే సో బెటర్" సక్సెస్ మీట్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "సోలో బ్రతుకే సో బెటర్" మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన"సోలో బ్రతుకే సో బెటర్" మూవీ అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకాదరణ పొంది దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. థమన్ సంగీతం అందించారు.