ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డ సాయి తేజ్ ఇప్పుడు వరుస హిట్స్ తో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రతీ రోజూ పండుగే, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో వరస హిట్స్ అందుకొని మంచి ఫాంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం దేవ్ కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని..పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు వాటిలోని లోపాలను చూపించేలా సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సాయి తేజ్ కు సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. రామ్ చరణ్ తన ట్విట్టర్ లో సాయి తేజ్ పోస్టర్ ను రిలీజ్ చేసి.. పోస్టర్ తనకెంతో నచ్చిందని తెలుపుతూ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించాడు.
Loved the poster!
Wishing my dear brother @IamSaiDharamTej , director @devakatta & the entire team … All the best!!#Republic#RepublicFirstLook#RepublicOnJune4th pic.twitter.com/wRsaCoPT3s— Ram Charan (@AlwaysRamCharan) March 25, 2021
కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: