
ట్యాగ్ · 61 కథనాలు · పేజీ 3


సోషల్ మీడియా లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలి - నిధి

విజయ్ దేవరకొండ కరోనా సందేశం

'ఆదిపురుష్' టీమ్ షిఫ్ట్ టు హైద్రాబాద్

అనాథ పిల్లలకు అండగా హీరో సందీప్ కిషన్

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం

తెలంగాణలో థియేటర్లు బంద్

కరోనా వచ్చింది.. సేవకు టైం దొరికింది

కరోనా వచ్చింది.. కానీ..!

నివేదా థామస్ కు కరోనా పాజిటివ్
ఆడియెన్స్ కు రవితేజ రిక్వెస్ట్
"కరోనా వైరస్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
థియేటర్ లో మొదటి సినిమా నాదే

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ మూవీ
సినిమా షూటింగుల నిలిపివేత పొడిగింపు
భయం.. నిర్లక్యం రెండూ వద్దు
పూజా హెగ్డే స్వీయ గృహ నిర్బంధం
విద్యా సంస్థల వార్షికోత్సవం వాయిదా

కరోనా నుండి కోలుకున్న పవన్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి క్వారంటైన్ లోనే ఉన్నారు పవన్. తన ఫామ్ హౌస్ లోనే ఉండి ఇన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. ఇక పవన్ కోలుకున్నా ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని ఇంకా ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక ఈవిషయాన్ని జనసేన పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కోలుకున్న విషయాన్ని ప్రకటించారు.

సోషల్ మీడియా లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలి - నిధి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "హరి హర వీరమల్లు "మూవీలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రజలలో సోషల్ మీడియా ప్రభావం అధికమని తెలిసిన విషయమే. సోషల్ మీడియా లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలనీ , కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాధితుల సహాయానికి సంబంధించిన పోస్టులను మనం గమనిస్తూనే ఉన్నామనీ , ఇటువంటి సందర్భాల్లో కూడా కొందరు నెగటివ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారనీ అది కరెక్ట్ కాదనీ నిధి చెప్పారు.

విజయ్ దేవరకొండ కరోనా సందేశం
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ప్రజలలో భయాందోళనలు పెరిగిపోయాయి. సినీ సెలబ్రిటీస్ ప్రజలకు ధైర్యం చెబుతూ కరోనా మహమ్మారి కై తీసుకోవాల్సిన జాగ్రత్తలగురించి ప్రజలలో అవగాహన కలిగిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి సినీ నటులు విజయ్ దేవరకొండ చెబుతున్నారు చూడండి’ అంటూ తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో ఒక వీడియోని షేర్ చేసింది.

'ఆదిపురుష్' టీమ్ షిఫ్ట్ టు హైద్రాబాద్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు కూడా మొన్నటివరకూ స్పీడుగానే జరుగుతుంది . అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. సినిమా కోసం ముంబైకే మకాం మార్చిన ప్రభాస్ కూడా ఇక్కడికే వచ్చేశాడు.

అనాథ పిల్లలకు అండగా హీరో సందీప్ కిషన్
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. ప్రజలంతా భయాందోళనతో ఉంటున్నారు. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ , కర్ఫ్యూ విధించాయి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం చేయూతగా ఉండడం చాలా ముఖ్యం. సినీ సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా కరోనా బాధితులకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యువ హీరో సందీప్ కిషన్ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టి , తన మంచి మనసును చాటుకున్నారు.

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి చిత్రపరిశ్రమ పలు విధాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. 9 నెలల తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడింది. తిరిగి కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్స్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మూవీ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.

తెలంగాణలో థియేటర్లు బంద్
సినీ ఇండస్ట్రీపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బాగానే పడింది. ఇప్పటికే ఏపీలో థియేటర్ ఆక్యుపెన్సీని 50 వ శాతానికి తగ్గించారు. అలానే తెలుగు నిర్మాతల మండలి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పరిమిత బృందంతో చిత్రీకరణలు, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటనలో పేర్కొంది. అత్యవసరం అనుకుంటే 50 మంది కార్మికులతో షూటింగ్ చేసుకోవచ్చని, అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా థియేటర్ల విషయంపై ఓ జీవోని జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ.. ఇది ఈ నెల…

కరోనా వచ్చింది.. సేవకు టైం దొరికింది
టాలీవుడ్ లో మరో నటడు కరోనా బారిన పడ్డాడు. ఈ నటుడు ఎవరో కాదు సోనూ సూద్. సోనూ సూద్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈవిషయాన్ని సోనూ సూద్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ‘ఈ రోజు ఉదయం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది. ముందుజాగ్రత్త చర్యగా నేను ఇప్పటికే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. దీనివల్ల మీ సమస్యల పరిష్కారం కోసం నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విషయం గుర్తుపెట్టుకోండి’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. దీంతో సోనూసూద్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్…

కరోనా వచ్చింది.. కానీ..!
బాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది నటీ నటులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు అక్కడ థియేటర్స్ కూడా మూసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు చిన్నగా టాలీవుడ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అల్లు అరవింద్ కూడా తనకు కరోనా వచ్చిందని నిర్ధారించారు. ఈమేరకు అందరికీ ఒక సలహా ఇస్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు.

నివేదా థామస్ కు కరోనా పాజిటివ్
కరోనా సెకండ్ వేవ్ లో కేసులు బాగానే పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు కూడా చాలా మంది మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. గత ఏడాది కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎంత నష్టపోయిందో తెలుసు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు అనుకునే లోపు మళ్లీ సెకండ్ వేవ్ అంటూ కరోనా ప్రభావం ఎక్కువైపోయింది. ముంబైలో ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు నివేదా థామస్ కు కూడా కరోనా సోకింది.
ఆడియెన్స్ కు రవితేజ రిక్వెస్ట్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.. 6వ తేదీ (ఈ రోజు )“క్రాక్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
"కరోనా వైరస్ " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించి వివాదాస్పద దర్శకుడిగా మారారు. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ నిలిచిపోయినా , కరోనా టైమ్ లో తగిన జాగ్రత్తలతో పలు మూవీస్ ను తెరకెక్కించిన ఘనత వర్మదే.
థియేటర్ లో మొదటి సినిమా నాదే
మొత్తానికి థియేటర్లు తెరుచుకునే టైం వచ్చేసింది. లాక్ డౌన్ వల్ల గత 8 నెలల నుండి థియేటర్స్ మూతపడే ఉన్నాయి. లాక్ డౌన్ తీసినా కూడా థియేటర్స్ కు మోక్షం రాలేదు ఇన్ని రోజులు. ఇక ఎంతో మంది సినీ లవర్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను మిస్ అయ్యారు. ఇక ఇప్పుడు అటు సినీ ఇండస్ట్రీకే కాదు.. సినీ లవర్స్ కు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50 % సిట్టింగ్ తో తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో కొన్ని నెలల తర్వాత మళ్ళీ ధియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో తమ సినిమాలను ధియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి జాగ్రత్తలపై వీడియో సాంగ్
కరోనా మహమ్మారి కారణంగా జన జీవితం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పై అవగాహన తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగీత దర్శకుడు కోటి ఒక సాంగ్ ను కంపోజ్ చేశారు. కోటి స్వరకల్పనలో కోటి ఆలపించిన ఈ సాంగ్ లో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అభినయించారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ మూవీ
కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాణ భయం తో ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాలు విశేష కృషి చేస్తున్నాయి. ప్రాణాలకు తెగించి వైద్య బృందాలు, పోలీస్ శాఖ, అనేక డిపార్ట్ మెంట్స్ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడుకరోనా మహమ్మారి నేపథ్యంలో ఒక మూవీ రూపొందనుంది.

కరోనా కోసం ముందుకొచ్చిన టాలీవుడ్ దాతలకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్
టాలీవుడ్ సినీ తారలు 'కరోనా' కట్టడి కోసం విరాళాలు ఇవ్వడానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఒకరోజు అటు ఇటుగా అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి తమ వంతు సాయం అందించారు. ఇంకా విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరాళాలు ఇచ్చి ప్రజలకు అండగా నిలిచినందుకు... పేరు పేరునా హీరోలకు కృతజ్ఞతలు తెలిపాడు.
సినిమా షూటింగుల నిలిపివేత పొడిగింపు
రోజు రోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. ఎవరికి వాళ్లు స్వతహాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బయట తిరగడం.. తినడం మానేశారు. ఇక థియేటర్స్, షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఆఫీస్ లు అన్నీ మూత పడ్డాయి. ఇక సినీ పరిశ్రమ కూడా ఈ వైరస్ కు భయపడిపోయి ఎక్కడిక్కకడ షూటింగ్ లను మధ్యలోనే ఆపేసి ఇళ్లకు చేరుకున్నారు. రిలీజ్ సినిమాలను వాయిదా వేసుకున్నారు.
భయం.. నిర్లక్యం రెండూ వద్దు
కరోనా వరుస భయం యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా...మనదేశంలో నివారణ చర్యలు ముమ్మరం చేశారు. దీనిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే పలువురు సెలబ్రిటీలు తమ వంతుగా ఈ వైరస్ అంటకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు వీడియోల ద్వారా చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వీడియో ద్వారా ప్రజలకు ధైర్యాన్ని.. సలహాలను పంచుకున్నారు.
పూజా హెగ్డే స్వీయ గృహ నిర్బంధం
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం "#Prabhas 20", అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో పూజ నటించిన "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించటం తో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందే "కభీ ఈద్ కభీ దివాలీ " మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
విద్యా సంస్థల వార్షికోత్సవం వాయిదా
విలక్షణ నటుడు మోహన్ బాబు 1992 సంవత్సరంలో తిరుపతి లో శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు బర్త్ డే రోజు మార్చి 19వ తేదీ ప్రతీ సంవత్సరం విద్యా సంస్థల వార్షికోత్సవం జరుగుతుంది. 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంది. 40వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు విద్య ను అందిస్తున్న విద్యా సంస్థల వార్షికోత్సవం కరోనా వైరస్ కారణంగా వాయిదాపడింది.