కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ మూవీ

Awe Director Prashanth Varma To Make A Movie Based On Corona Virus

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రాణ భయం తో ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాలు విశేష కృషి చేస్తున్నాయి. ప్రాణాలకు తెగించి వైద్య బృందాలు, పోలీస్ శాఖ, అనేక డిపార్ట్ మెంట్స్ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడుకరోనా మహమ్మారి నేపథ్యంలో ఒక మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అ !”, “కల్కి”వంటి వైవిధ్య భరిత మూవీస్ రూపొందించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కరోనా మహమ్మారి బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ రూపొందించనున్నారు. కరోనా వైరస్ అటాక్ చేయక ముందే ఇటువంటి థీమ్ తో మూవీ రూపొందించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసినట్టు , ఒక అప్ కమింగ్ హీరోతో రూపొందించే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. వైవిధ్య దర్శకుడిగా ముద్ర పడిన ప్రశాంత్ వర్మ, ఆ ముద్ర ను నిలుపుకొనేట్టుగా ఈ మూవీ ని రూపొందించాలనుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 13 =