టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించి వివాదాస్పద దర్శకుడిగా మారారు. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ నిలిచిపోయినా , కరోనా టైమ్ లో తగిన జాగ్రత్తలతో పలు మూవీస్ ను తెరకెక్కించిన ఘనత వర్మదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎ కంపెనీ , సి ఎమ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామ్ గోల్ వర్మ నిర్మాతగా అగస్త్య మంజు దర్శకత్వంలో శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో రూపొందిన నిజ జీవిత హారర్ థ్రిల్లర్ డ్రామా “కరోనా వైరస్ ” మూవీ రూపొందింది. ఈ మూవీ కి DSR సంగీతం అందించారు. “కరోనా వైరస్ ” మూవీ డిసెంబర్ 11 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుందనీ , ఆ మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ కానుందనీ వర్మ ట్వీట్ చేశారు. కొన్ని నిబంధనలతో థియేటర్స్ రీ ఓపెన్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఏ మూవీ రిలీజ్ కాలేదు. 8 నెలల తరువాత థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ గా “కరోనా వైరస్ ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: