సినిమా వార్తలు
ట్యాగ్ · 61 కథనాలు · పేజీ 4
సినిమా వార్తలు
'కరోనా' కే ఛాలెంజింగ్ గా ప్రభాస్ టీమ్..!
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఎక్కువగా వినిపించే పేరు 'కరోనా'. ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది ఈ కరోనా. చైనా పుట్టిన ఈ మహమ్మారి వైరస్.. చిన్నగా పలు దేశాల్లో వ్యాపిస్తుంది. దీనితో జనాలు బయట తిరగడం మానేశారు. స్కూళ్ళు, ఆఫీస్ లకు సెలవలు ప్రకటించారు. ఇక సినీ పరిశ్రమలు కూడా తమ షూటింగ్ లను ఆపేసుకుంటున్నాయి. థియేటర్స్ మూసేయడంతో సినిమాల రిలీజ్ లను వాయిదా వేసుకుంటున్నారు. అంతేకాదు కరోనా వల్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.