కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ప్రజలలో భయాందోళనలు పెరిగిపోయాయి. సినీ సెలబ్రిటీస్ ప్రజలకు ధైర్యం చెబుతూ కరోనా మహమ్మారి కై తీసుకోవాల్సిన జాగ్రత్తలగురించి ప్రజలలో అవగాహన కలిగిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి సినీ నటులు విజయ్ దేవరకొండ చెబుతున్నారు చూడండి’ అంటూ తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో ఒక వీడియోని షేర్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చూడండి: కోవిడ్ లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి సినీ నటులు @TheDeverakonda చెబుతున్నారు…#TelanganaFightsCovid19 pic.twitter.com/oq2ly2KAcY
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) May 7, 2021
కొవిడ్ సెకండ్ వేవ్ దేశం మొత్తాన్ని ఎంతో ఇబ్బంది పెడుతుందనీ , 2020లో అందరం ఎంతో ఇబ్బంది పడ్డామనీ , బయటపడ్డాం అనుకునే లోపు పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైందనీ , లక్షలాది మంది వ్యాధికి గురవుతున్నారు. వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. కానీ మనమందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చనీ , దగ్గు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, ఒంటినొప్పి వంటివి ఉంటే.. అది కొవిడే అయింటుందనీ , మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడటం మొదలెట్టండనీ , తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆరోగ్య సెంటర్లలో, ఏరియా హాస్పిటల్స్‌లో, బస్తీ దవాఖానాలలో కొవిడ్ అవుట్ పేషెంట్ డాక్టర్లను పెట్టిందనీ , కొవిడ్ టెస్ట్ చేయించుకుని, ఆ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూస్తూ.. టైమ్ వృధా చేసుకోకండనీ , ఎందుకంటే ఇప్పుడు టైమ్ చాలా ముఖ్యమనీ , ఎటువంటి లక్షణాలు మీకు కనిపించినా.. అది కొవిడే అనుకోండి. అందరికీ దూరంగా ఉంటూ.. మీరు చికిత్స ప్రారంభించండి. చికిత్స ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. చికిత్స కూడా పెద్దగా ఏమీ ఉండదు. కొన్ని ట్యాబ్‌లెట్స్ ఉంటాయి. ఏ గవర్నమెంట్ హెల్త్ సెంటర్‌కి వెళ్లినా.. ఒక కిట్ రూపంలో మీకు లభిస్తాయి. భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి అంటూ విజయ్ దేవరకొండ ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: