జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి క్వారంటైన్ లోనే ఉన్నారు పవన్. తన ఫామ్ హౌస్ లోనే ఉండి ఇన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. ఇక పవన్ కోలుకున్నా ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని ఇంకా ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక ఈవిషయాన్ని జనసేన పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కోలుకున్న విషయాన్ని ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోలుకున్నారని ,వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆయనకు మరోసారి పరీక్షలు నిర్వహించారని ఆ పరీక్షల్లో నెగటివ్ గా నిర్ధారణ అయింది అంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది.అంతేకాదు ఆరోగ్యపరంగా ఆయనకు ఇబ్బంది ఏమీ లేవని వైద్యులు తెలిపారని కూడా పేర్కొంది. ఇదే సమయంలో తన ఆరోగ్య క్షేమం కోసం ఆకాంక్షించిన వారందరికీ, పూజలు,ప్రార్థనలు చేసిన వారందరికీ, జన సైనికులకు, నాయకులు,అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ కూడా చేస్తున్నాడు. ఈసినిమాను నాగవంశీ తన బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: