
ట్యాగ్ · 22 కథనాలు


అందుకే మెగాస్టార్ అయ్యారు

'గాడ్ ఫాదర్' లో ఇప్పటివరకూ చేయని పాత్ర చేశా

గాడ్ ఫాదర్ లో నా అంచనా తప్పలేదు

సల్మాన్ భాయ్ తో చిరు స్టెప్పులు..!

ఆర్ఆర్ఆర్ పై చిరు రియాక్షన్.. హ్యాట్సాఫ్ టీమ్..!

సూపర్ స్టైలిష్ లుక్ లో చిరంజీవి

ఒకే సెట్ లో 'గాడ్ ఫాదర్, భీమ్లానాయక్' ల సందడి..!

మెగా రికార్డ్

స్పీడు పెంచుతున్న 'చిరు'..!

చిరంజీవి మూవీ లో నటిస్తున్నా -సల్మాన్ ఖాన్

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్

'గాడ్ ఫాదర్' సత్యదేవ్ పాత్రలో మార్పు లేదు

చిరు తో సల్మాన్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన థమన్

యాక్షన్ సీన్స్ చిత్రీకరణ లో "గాడ్ ఫాదర్"

చిరంజీవి "బతుకమ్మ "పండగ శుభాకాంక్షలు

'గాడ్ ఫాదర్' మ్యూజిక్ సెషన్స్

ఊటీ లో చిరు 'గాడ్ ఫాదర్'

అనసూయ మెగా డ్రీమ్

గాడ్ ఫాదర్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఆచార్య తో కాస్త డల్ అయిన చిరుకు ఈసినిమా బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈ పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంది. ఈసినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే మెగాస్టార్ అయ్యారు
మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గాడ్ ఫాదర్. రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు ఈసినిమా కోసం అలానే ఈసినిమా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ సినిమాపై వరుస అప్ డేట్లతో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. వరుసగా పలు పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా జరపనున్నారు.

'గాడ్ ఫాదర్' లో ఇప్పటివరకూ చేయని పాత్ర చేశా
భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో సత్యదేవ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

గాడ్ ఫాదర్ లో నా అంచనా తప్పలేదు
గాడ్ ఫాదర్ లో నా అంచనా తప్పలేదు అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఏ విషయం ఏంటీ అంటే.. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేసింది.

సల్మాన్ భాయ్ తో చిరు స్టెప్పులు..!
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఒక సినిమానే గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఈసినిమా నుండి చిరు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఆర్ఆర్ఆర్ పై చిరు రియాక్షన్.. హ్యాట్సాఫ్ టీమ్..!
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఈసినిమా గురించే వినిపిస్తుంది. ఎంతో కాలం నిరీక్షణ తరువాత.. ఎన్నో అంచనాల మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ఈసినిమా సినిమా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్-చరణ్ ల పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇక నుండి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అని చెప్పాల్సి వస్తుందని అంటున్నారు.

సూపర్ స్టైలిష్ లుక్ లో చిరంజీవి
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఒకే సెట్ లో 'గాడ్ ఫాదర్, భీమ్లానాయక్' ల సందడి..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా చరణ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నా అప్పుడప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. ముఖ్యంగా తన సినిమాలతో పాటు చిరు, పవన్ లకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికే చరణ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు.

మెగా రికార్డ్
10 సంవత్సరాల గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150" మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని తన స్టామినా నిరూపించుకున్నారు. తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి చిరంజీవి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి కథానాయకుడిగా "ఆచార్య ", "గాడ్ ఫాదర్ ", "భోళా శంకర్ ", చిరంజీవి 154 మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి.

స్పీడు పెంచుతున్న 'చిరు'..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా.. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకంటే ఫాస్ట్ గానే తమ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు టాలీవుడ్ అగ్రహీరోలు. పాతతరంలో అయితే ఏడాదికి 10 సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. రాను రాను ఆసంఖ్య తగ్గినా తరువాత హీరోలు కనీసం నాలుగైదు సినిమాలు అయినా చేసేవాళ్లు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. స్టార్ హీరోలయితే ఏడాదికి ఒక సినిమా చాలు అన్నట్టు గా చేస్తున్నారు.

చిరంజీవి మూవీ లో నటిస్తున్నా -సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , ఆయుష్ శర్మ , మహిమ మక్వాన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "అంతిమ్:ది ఫైనల్ ట్రూత్ మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. బుధవారం "అంతిమ్:ది ఫైనల్ ట్రూత్ మూవీ థ్యాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ, డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ హాజరయ్యారు.

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నయనతార నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రను నయనతార చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలయితే వస్తున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా తను ఈసినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ…

'గాడ్ ఫాదర్' సత్యదేవ్ పాత్రలో మార్పు లేదు
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్ తో వస్తుంది. ఇక ఈసినిమాలో ఇంకా పలు కీలక పాత్రలు ఉండగా ఆ పాత్రల్లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు క్లారిటీ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మలయాళంలో మంజు వారియర్ పాత్రను తెలుగులో నయన్, ఆమె భర్తగా వివేక్ ఒబెరాయ్ పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నారు.

చిరు తో సల్మాన్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన థమన్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పూర్తవ్వడంతో వెంటనే మెహర్ రమేష దర్శకత్వంలో గాడ్ పాధర్ సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకోగా రెండో షెడ్యూల్ లో ఉంది.

యాక్షన్ సీన్స్ చిత్రీకరణ లో "గాడ్ ఫాదర్"
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో సత్యదేవ్ , గంగవ్వ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.”గాడ్ ఫాదర్ ” మూవీ లో తన పాత్రకై చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో యంగ్ లుక్ లోకి మారారు.

"గాడ్ ఫాదర్ " లో బ్రిట్నీ స్పియర్స్ పాప్ సాంగ్ ?
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్ " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

చిరంజీవి "బతుకమ్మ "పండగ శుభాకాంక్షలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమర్జనం చేస్తారు. , తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చినా గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు.

'గాడ్ ఫాదర్' మ్యూజిక్ సెషన్స్
చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ కాగా ఇక్కడ అభిమానులకు తగ్గట్టు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఊటీ లో చిరు 'గాడ్ ఫాదర్'
చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించారు కూడా. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని కీలకమైన మార్పులు చేసి ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అయింది. ఇక ఇక్కడే కొన్నిరోజులు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తాజాగా ఊటీకి వెళ్లింది. అక్కడ ప్రధాన పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. దాదాపు రెండు వారాల పాటు ఆ షెడ్యూల్ కొనసాగే అవకాశం…

అనసూయ మెగా డ్రీమ్
బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అనసూయ తన టాలెంట్ ను ప్రూవ్ చేశారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.