మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’కి ఇది రీమేక్. తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్ తో వస్తుంది.
ఇక ఈసినిమాలో ఇంకా పలు కీలక పాత్రలు ఉండగా ఆ పాత్రల్లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు క్లారిటీ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మలయాళంలో మంజు వారియర్ పాత్రను తెలుగులో నయన్, ఆమె భర్తగా వివేక్ ఒబెరాయ్ పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రీసెంట్ గా మరో వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే.. సత్యదేవ్ ను నయనతార రీప్లేస్ చేయమన్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు డైరక్టర్ మోహన్ రాజా. సత్యదేవ్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఈసినిమాలో ఖచ్చితంగా సత్యదేవ్ నటిస్తున్నాడని.. జనవరి నుండి తను కూాడా షూటింగ్ లో పాల్గొంటాడని మోహన్ రాజా క్లారిటీ ఇచ్చారు. మరి సత్యదేవ్ నటన ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఖచ్చితంగా వివేక్ ఒబెరాయ్ పాత్రకు సత్యదేవ్ న్యాయం చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..
కాగా ఈసినిమాలో సల్మాన్ కూడా ఉండబోతున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అంతేకాదు చిరు-సల్మాన్ కు ఒక పాట ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: