కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అనసూయ మెగా డ్రీమ్

Anasuya Bharadwaj Fulfills Her Dream Of Acting Along Mega Star Chiranjeevi In God Father Movie,Anasuya’s Mega Dream Finally Becomes Reality,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Anchor Anasusya Bharadwaj,Anasusya

అనసూయ మెగా డ్రీమ్

Anasuya Bharadwaj Fulfills Her Dream Of Acting Along Mega Star Chiranjeevi In God Father Movie

Anasuya Bharadwaj Fulfills Her Dream Of Acting Along Mega Star Chiranjeevi In God Father Movie,Anasuya’s Mega Dream Finally Becomes Reality,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Anchor Anasusya Bharadwaj,Anasusya

బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అనసూయ తన టాలెంట్ ను ప్రూవ్ చేశారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” లో ఒక కీలక పాత్రకు అనసూయ ఎంపిక అయ్యారు. ఒక ఇంటర్వ్యూ లో అనసూయ మాట్లాడుతూ .. చాలా కాలంగా చిరంజీవి సార్ తో నటించడం తన డ్రీమ్ అనీ , కొన్ని సార్లు అవకాశం వచ్చినాసెట్ కాలేదనీ , “గాడ్ ఫాదర్ ” మూవీ లో చిరంజీవి తో స్క్రీన్ షేర్ చేసుకొనడం హ్యాపీ ఉందనీ చెప్పారు. త్వరలోనే అనసూయ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. చిరంజీవి హోస్ట్ గా ఉన్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఒక ఎపిసోడ్ లో అనసూయ పాల్గొన్న విషయం తెలిసిందే.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్