రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఒక సినిమానే గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఈసినిమా నుండి చిరు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు చిరు. తన ట్విట్టర్ ద్వారా.. సల్మాన్ భాయ్ తో స్టెప్పులు.. ప్రభుదేవా బెస్ట్ కొరియోగ్రఫీ అందించారు.. ఈ పాట ఖచ్చితంగా ఫ్యాన్స్ కు కనుల విందుగా ఉంటుందని సెట్ లో షూట్ జరుగుతున్న ఫొటోను షేర్ చేశారు. మరి ఎప్పటి నుండో వీరిద్దరికీ స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటూనే ఉన్నారు. ఇప్పుడది నిజమని కన్ఫామ్ అయిపోయింది. ఇక వీరి స్పెషల్ సాంగ్ ను స్క్రీన్ పై చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Shaking a leg with The Bhai @BeingSalmanKhan for #GodFather @PDdancing is at his Choreographing Best!! A sure shot Eye Feast!!@jayam_mohanraja @AlwaysRamcharan@MusicThaman @SuperGoodFilms_@KonidelaPro #Nayanthara @ProducerNVP @saregamasouth pic.twitter.com/mRjXRNhaJB
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 29, 2022
కాగా ఈసినిమాలో నయనతార, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: