రీసెంట్ గా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక మెగాస్టార్ సినిమా కాబట్టి ఈసినిమాపై మాములుగానే అంచనాలు ఉంటాయి. దీంతో ప్రేక్షకులు ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, వివేక్ ఒబెరాయ్, సత్యదేవ్, పూరీ జగన్నాథ్, సముద్రఖని, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం.. మోహన్ రాజా
నిర్మాతలు.. రామ్ చరణ్, ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్
బ్యానర్స్.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్
సంగీతం.. ఎస్ఎస్. థమన్
సినిమాటోగ్రఫి..నీరవ్ షా
కథ
మలయాళంలో లూసిఫర్ సినిమా చూసిన వాళ్లకు ఈసినిమా కథ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ రీమేక్ లో స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు. ఇక ఈ కథ విషయానికొస్తే.. ముఖ్యమంత్రి పి.కె.అర్ హాఠాన్మరణంతో సీఎం పీఠంపై పార్టీనేతలు కన్నేస్తారు. వారిలో సీఎం అల్లుడు జై దేవ్ (సత్యదేవ్) కూడా ఉంటాడు. మరోవైపు భర్త జయ్ దేవ్ (సత్య దేవ్) ను ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేస్తోంది పి.కె.అర్ కుమార్తె సత్యప్రియ (నయనతార). ఈ నేపథ్యంలో జన జాగృతి పార్టీని కాపాడే క్రమంలో బ్రహ్మా (చిరంజీవి) ఎంట్రీ ఇస్తాడు. అయితే చిన్నతనం నుంచి సత్యప్రియ బ్రహ్మను ద్వేషిస్తూ ఉంటుంది. అసలు బ్రహ్మ ఎవరు ?, గాడ్ ఫాదర్ గా అతని గత జీవితం ఏమిటి?, ఈ మధ్యలో మసూన్ భాయ్ (సల్మాన్ ఖాన్) పాత్ర ఏమిటి ?, చివరకు బ్రహ్మ ఎవర్ని ముఖ్యమంత్రిని చేశాడు? దాని కోసం ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
విశ్లేషణ..
ఈసినిమా లూసిఫర్ సినిమాకు రీమేక్ అయినా కూడా ఆ భావన చూస్తున్న ప్రేక్షకులకు ఏమాత్రం అనిపించదు. డైరెక్ట్ సినిమానే అనిపిస్తుంది. లూసిఫర్ లో ఉన్న కథాంశంను తీసుకున్నారు తప్ప మక్కీకి మక్కీ రీమేక్ చేసే ప్రయత్నం చేయకపోవడమే ఈసినిమా సక్సెస్ కు ప్రధాన కారణమైందని చెప్పొచ్చు. నిజానికి రీమేక్ చేయడం అంటేనే చాలా కష్టం. అందులోనూ ఇప్పటికే ప్రజలందరు చూసేసిన ఈ సినిమాను రీమేక్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఆవిషయంలో మోహన్ రాజా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు కథలో చాలా మార్పులు చేశాడు. రీమేక్ అయినా కూడా సాధ్యం అయినంత వరకు కొత్తగా ఉండేలా ప్రయత్నించాడు. ఒరిజినల్ స్టోరీ లైన్ మిస్ అవ్వకుండా ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండానే చిరంజీవి కి తగ్గట్లుగా గాడ్ ఫాదర్ ని తెరకెక్కించాడు.
మెగాస్టార్ చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. గాడ్ ఫాదర్ గా, బ్రహ్మ గా నటించిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పటిలాగే తన నటనతో మెప్పించారు. యాక్షన్ సన్నివేశాల్లో ఎలాగైతే వావ్ అనిపించారో.. ఎమోషనల్ సన్నివేశాల్లో అలానే భావోద్వేగాలను పండించారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా మెగా స్టార్ ను ఈ సినిమాలో కాస్త ఏజ్ ఎక్కువ అయిన వ్యక్తి పాత్రలో నటించినా కూడా ఫ్యాన్స్ కు మాత్రం ఖచ్చితంగా నచ్చేస్తుంది.
ఈసినిమాకు చిరంజీవి పాత్ర తరువాత అంతే ముఖ్యమైన పాత్ర నయనతారది అని చెప్పొచ్చు. ఇక నయనతార సీరియస్ పాత్రలో నటించి మెప్పించింది. లేడీ సూపర్ స్టార్ స్థాయికి తగ్గ పాత్ర అనడంలో సందేహం లేదు.
సత్యదేవ్ కు కూడా ఈసినిమాలో మంచి రోల్ దక్కిందని చెప్పొచ్చు. ఇక ఏ రోల్ అయినా సరే ఆపాత్రలో జీవించేస్తాడు సత్యదేవ్. అలానే ఈసినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన బాడీలాంగ్వేజ్ తో సత్యదేవ్ విలన్ పాత్రలో సూపర్ అనిపించాడు.
టెక్నికల్ వాల్యూస్..
ఇక టెక్నికల్ గా వాల్యూస్ విషయానికొస్తే.. గాడ్ ఫాదర్ తెర వెనుక హీరో థమన్ అనే చెప్పాలి. సినిమాలో ప్రతీ సన్నివేశంలో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇలాంటి సినిమాలకు పాటలు పెద్దగా ఎక్స్ పెక్ట్ చేసేది ఏముండదు. నిజానికి సీరియస్ కథల్లో ఎంత తక్కువ పాటలు ఉంటే అంత బెటర్ గా ఫీలవుతుంటారు. అయితే ఈ సినిమాలో ఉన్న రెండు మూడు పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఆచార్య తో కాస్త డల్ అయిన చిరుకు ఈసినిమా బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈ పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంది. ఈసినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: