అందుకే మెగాస్టార్ అయ్యారు

Satyadev About Megastar Chiranjeevi,Satyadev About His Role in Godfather,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie latest Updates,Godfather Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Upcoming Movie Godfather,Hero Satyadev,Actro Satyadev,Satyadev About Godfather Movie,Satyadev Role in Godfather Movie,Satyadev About Godfather Movie,Satyadev Upcoming Movies,Satyadev New Movie Updates,Satyadev Upcoming Projects,Satyadev About Chiranjeevi

మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గాడ్ ఫాదర్. రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు ఈసినిమా కోసం అలానే ఈసినిమా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ సినిమాపై వరుస అప్ డేట్లతో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. వరుసగా పలు పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా జరపనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ఎంతోమంది టాలెంటెడ్ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో సత్యదేవ్ కూడా ఒకరు. ఈపాత్రకోసం చిరునే సత్యదేవ్ ను కావాలని తీసుకున్నారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. చిరునే తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు సత్యదేవ్ నటన గురించి. ఇదిలా ఉండగా తాజాగా సత్యదేవ్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈసందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్ మెగాస్టార్ పై ప్రశంసలు కురిపించారు. .చిరు గాడ్ ఫాథర్ సెట్స్ లో చాలా డిసిప్లిన్ గా ఉండేవారని ఆయనొక లైవ్ వైర్ లాంటి వారని అందుకే తాను “మెగాస్టార్” అయ్యారని తెలిపారు.

కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =