చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ కాగా ఇక్కడ అభిమానులకు తగ్గట్టు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సెషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలియచేశారు. తమన్, దర్శకుడు మోహన్ రాజా, డివోపి నీరవ్ షా దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక మెగా హీరోలందరితోనూ పని చేసిన తమన్.. ఇప్పుడు చిరు తో చేస్తున్నాడు. చిరుకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.
With My dear director@jayam_mohanraja ❤️
Our dear Dop 🎥 #NiravShah 🤩
For Our #MegaStar’s ⭐️@KChiruTweets #Godfather ✍️
Jus loving this team of #Chiru153 #Godbless 💥 pic.twitter.com/Z1MX2QLdAt— thaman S (@MusicThaman) October 3, 2021
కాగా రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టింది. వీటితో పాటు బాబి దర్శకత్వంలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: