గాడ్ ఫాదర్ లో నా అంచనా తప్పలేదు

Chiranjeevi About Godfather Movie,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Chiranjeevi,Megastar Chiranjeevi,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Telugu Movie Godfather,Chiranjeevi Upcoming Movie Godfather,Megastar Chiranjeevi About Godfather Movies,Godfather Telugu Movie latest Updates,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi In an Interview,Chiranjeevi in an Interview About Godfather Movie

గాడ్ ఫాదర్ లో నా అంచనా తప్పలేదు అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ ఏ విషయం ఏంటీ అంటే.. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా.. చిరు కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిరు తన పాత్ర గురించి మాట్లాడుతూ.. కొత్తగా నన్ను నేను ఆవిష్కరించుకోవడం కోసమే నేను ‘లూసిఫర్’ రీమేక్ ను ఎంచుకున్నాను. జీవితాన్ని కాచి ఒడబోశాడు అనేట్టుగా కనిపించాలనే ఉద్దేశంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ను ఎంచుకున్నాను. లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఊహ .. అంచనా తప్పలేదని అనిపించింది. ఈ సినిమాలో నాపై గల ప్రేమతో సల్మాన్ చేశాడు. అందుకు ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. సత్యప్రియ పాత్రలో నయనతార అద్భుతంగా ఒదిగిపోయింది. ఆమె గ్లామర్ .. యాక్టింగ్ ఈ సినిమాకి బాగా సపోర్టు చేశాయి. ఇక సత్యదేవ్ ను ఆ పాత్రకి నేనే సిఫార్స్ చేశాను. ప్రతినాయకుడి తరహాలో సాగే ఆ పాత్రలో అతను గొప్పగా చేశాడు. ఇక ఒక ప్రత్యేకమైన పాత్రలో పూరి కనిపిస్తాడు. షాట్ కి రావడానికి కాస్త నెర్వస్ ఫీలయ్యాడు గానీ .. ఆ తరువాత చాలా బాగా చేశాడు చెప్పుకొచ్చారు.

కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్.. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =