మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నయనతార నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రను నయనతార చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలయితే వస్తున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా తను ఈసినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ నయనతారకు బర్త్ డే విషెస్ అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #Godfather wishes Nayanthara a Very Happy Birthday!!
MegaStar @Kchirutweets@jayam_mohanraja @alwaysramcharan #RBChoudary @ProducerNVP @KonidelaPRO @SuperGoodFilms_@MusicThaman @sureshsrajan pic.twitter.com/vM0NluAuNw
— Konidela Pro Company (@KonidelaPro) November 18, 2021
కాగా ఈసినిమాలో సత్యదేవ్ వివేక్ ఒబెరాయ్ పాత్రలో నటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే హాలీవుడ్ పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘గాడ్ ఫాదర్’లో మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పాట పాడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి వీటిపై కూడా క్లారిటీ రావాలంటే అఫీషియల్ గా ప్రకటించేవరకూ వెయిట్ చేయాల్సిందే. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: