10 సంవత్సరాల గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ “ఖైదీ నెం 150” మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని తన స్టామినా నిరూపించుకున్నారు. తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన “సైరా నరసింహా రెడ్డి” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి చిరంజీవి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి కథానాయకుడిగా “ఆచార్య “, “గాడ్ ఫాదర్ “, “భోళా శంకర్ “, చిరంజీవి 154 మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణం గా ఏ హీరో అయినా 4 లేదా 5 షెడ్యూల్స్ లో జరిగే షూటింగ్ లో తన పాత్ర మూడ్ లో నటించడం ఈజీ. డిఫరెంట్ కథాంశాలతో డిఫరెంట్ పాత్రలలో ఏక కాలంలో నటించడం మామూలు విషయం కాదు. డిసెంబర్ నెలలో 4 సినిమాల షూటింగ్స్ లో పాల్గొని రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు చిరంజీవి. వయసు తో నిమిత్తం లేకుండా యంగ్ హీరో వలే షూటింగ్స్ లో పాల్గొంటున్న తమ అభిమాన హీరో చిరంజీవి పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి హీరోగా మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























