
ట్యాగ్ · 21 కథనాలు


వార్ 2 ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ

బ్రహ్మాస్త్ర2, 3 ఆన్ ప్రోగ్రెస్

వార్ 2లో ఎన్టీఆర్ రోల్ రివీల్

వార్ 2 -నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్?

వార్ 2 కి సిద్దమైన హృతిక్, ఎన్టీఆర్

బ్రహ్మస్త్రం పార్ట్ 2&3 అప్డేట్స్

బ్రహ్మాస్త్ర క్లైమాక్స్ మేకింగ్ వీడియో రిలీజ్

బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్లు ముందే ఫిక్స్

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ టీజర్ రిలీజ్..!

'బ్రహ్మాస్త్ర'.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి

'బ్రహ్మాస్త్ర' కు అతిథిగా రాజమౌళి..!

దేవర ప్రమోషన్స్.. స్టార్ డైరెక్టర్స్‌తో ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తారక్ ముంబై పయనమై వెళ్లారు. అక్కడ పలువురు సెలబ్రీటీలను కలుసుకుంటున్నారు. సోమవారం 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగాను కలుసుకున్న విషయం తెలిసిందే.

వార్ 2 ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా వార్2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఈసినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. 2025 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బ్రహ్మాస్త్ర2, 3 ఆన్ ప్రోగ్రెస్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా మంచి హిట్ ను సాధించింది. అస్త్రావర్స్ అనే కాన్సెప్ట్ అస్త్రాలకు సంబంధించి హిస్టరీని చూపించారు. ఇక ఈసినిమా వచ్చి ఏడాది అయిపోయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈనేపథ్యంలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చివరిలో బ్రహ్మాస్త్ర 2, 3పార్ట్ లకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. బ్రహ్మాస్త్ర 2…

వార్ 2లో ఎన్టీఆర్ రోల్ రివీల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్,వార్ 2తో బాలీవుడ్ లోకి వెళ్లనున్నాడని తెలిసిందే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయనున్నాడు.స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.త్వరలోనే అఫిషియల్ గా ఈసినిమా లాంచ్ కానుంది.ఈసినిమాలో ఎన్టీఆర్,హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నాడు.ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండనుందో హింట్ ఇచ్చేసాడు అయాన్ ముఖర్జీ.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయాన్ ముఖర్జీ, వార్ 2 గురించి చెప్పుకొచ్చాడు.

వార్ 2 -నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా రూపొందుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసుకుంది ఈసినిమా. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా మేకర్స్. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.

వార్ 2కి హృతిక్ తోపాటు అతన్నే అనుకున్నాం
వార్ 2తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్లనున్నాడని తెలిసిందే.అఫీషియల్ గా ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది.హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కలిసి వార్ 2 లో నటించనున్నారు. బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా ఈఏడాది నవంబర్ లో ప్రారంభంకానుంది.బ్లాక్ బాస్టర్ మూవీ వార్ కి సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కనుంది.వార్ లో హృతిక్ తోపాటు టైగర్ ష్రాఫ్ నటించగా 2019లో విడుదలైన ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

వార్ 2 కి సిద్దమైన హృతిక్, ఎన్టీఆర్
సినీ ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. టాలెంట్ ఎక్కడ ఉంటే మేకర్స్ అక్కడికి వెళ్లిపోతున్నారు. అందుకే పయోగాత్మక సినిమాలు ఎన్నో చూస్తున్నాం. అంతేకాదు నటీనటులు కూడా ఒకే భాషకు పరిమితం కాకుండా వేరే భాషల్లో తమ ప్రతిభను చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మనవాళ్లు హిందీలో అలానే హిందీ నటీ నటులు తెలుగులో నటించడానికి ఏమాత్రం సందేహించడంలేదు. ఇప్పటికే మనవాళ్లు చాలామంది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఓ పవర్ పుల్ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఈ అప్ డేట్ తో…

బ్రహ్మస్త్రం పార్ట్ 2&3 అప్డేట్స్
రణబీర్ కపూర్ ,అలియా భట్ జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా బ్రహ్మస్త్రం:మొదటి భాగం-శివ గత ఏడాది సెప్టెంబర్ 9న విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ చిత్రం ఒక్క హిందీలోనే కాదు తెలుగులోనూ మంచి వసూళ్లను దక్కించుకుంది. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున,డింపుల్ కపాడియా,మౌని రాయ్ కీలకపాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా సినిమాలో విఎఫ్ఎక్స్ కి ప్రశంసలు దక్కాయి.

బ్రహ్మాస్త్ర క్లైమాక్స్ మేకింగ్ వీడియో రిలీజ్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. రెండు భాగాల్లో రాబోతున్న ఈసినిమాలో మొదటి భాగం బ్రహ్మాస్త్ర-శివ ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దీంతో ఈసినిమా అప్పటికే కాస్త డల్ గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు కాస్త ఊరటనిచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమాప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్లు ముందే ఫిక్స్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం కాస్త ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు. ఈసినిమా బాయ్ కట్ సెగను కూడా తట్టుకొని మంచి విజయాన్ని దక్కించుకుంది. నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా ఈసినిమా వెనుకాడలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా ఇప్పటికే 400 కోట్లకు పైగా సొంతం చేసుకుంది.

మూడు రోజులకు 125 కోట్ల తో దూసుకుపోతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్…

బ్రహ్మాస్త్ర ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్లు
బాలీవుడ్ కు గతకొద్ది రోజులుగా బ్యాడ్ డేస్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాడు. దానికి తోడు బాయ్ కట్ నినాదం ఒకటి. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకు బాయ్ కట్ సెగ తగిలి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కూడా కొట్టాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయినా కూడా ఈసినిమా అన్ని అడ్డంకులను దాటుకొని నిన్న రిలీజ్ అయింది.

బ్రహ్మాస్త్రం మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బ్రహ్మాస్త్ర కు బాయ్ కట్ బాలీవుడ్ ఎఫెక్ట్ తగులుతుందా?
ఒకవైపు ఎన్నో ఏళ్ల నుండి ఒక డైరెక్టర్ కంటున్న కల మరోవైపు బాయ్ కట్ అంటూ వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు.. ఇలాంటి నేపథ్యంలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా బ్రహ్మస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్- ఆలియా భట్ జంటగా నటించిన విజువల్ గ్రాండియర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాలుగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ పార్ట్ వన్ ను సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. అయితే మరోవైపు ఈసినిమాకు కూడా బాయ్ కట్ వివాదం అంటుకుంది. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఈసినిమా బాయ్ కట్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ రిలీజ్..!
బాలీవుడ్ నుండి రాబోతున్న భారీ ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్పెప్ట్ తో.. భారతీయ పురాతన సంస్కృతుల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించాడు. దాదాపు పదేళ్ల కష్టం తరువాత అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాను ముందు ఒక సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నా కథ.. కంటెంట్ వల్ల మూడు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

ది బిగినింగ్ ఆఫ్ 'బ్రహ్మాస్త్ర'.. అక్కడే ఆలోచన మొదలైంది..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన చిత్రం‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ ‘బ్రహ్మాస్త్రం- శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్స్ లో మాత్రం మేకర్స్ ఏ మాత్రం రాజీపడట్లేదు. ఉన్న టైమ్ ను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈసినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. కొత్త కొత్త విషయాలను తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా విజన్ ఏంటో అయాన్ ముఖర్జీ తెలియచేశాడు. అస్త్రాలు ఏంటి, వాటిలో…

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ టీజర్ రిలీజ్..!
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు అయాన్ ముఖర్జీ. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' కథ అని అర్థమవుతుంది. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, ఈసినిమా కథ అన్నీ బ్రహ్మాస్త్రపై అంచనాలు పెంచేసింది. ఇక ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

'బ్రహ్మాస్త్ర'.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇక దీనిలో భాగంగానే అప్ డేట్స్ స్టార్ట్ చేశారు. ఇక మంచి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని ఇప్పటికే ఈసినిమా మోషన్ పోస్టర్ ను చూస్తే అర్థమైపోయింది. ఇక ఈసినిమా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈసందర్భంగా ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా సౌత్ లో మాత్రం…

'బ్రహ్మాస్త్ర' తెలుగు మోషన్ పోస్టర్ రిలీజ్
కరోనా వల్ల ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆసినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. అలా చాలా రోజులపాటు పెండింగ్ లో ఉండి ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా బ్రహ్మాస్త్ర ఒకటి. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా రీసెంట్ గానే ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

'బ్రహ్మాస్త్ర' కు అతిథిగా రాజమౌళి..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది కానీ ఇంతవరకూ రిలీజ్ మాత్రం కాలేకపోయింది. మధ్యలో కరోనా కూడా రావడం వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ రీసెంట్ గానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రణబీర్ కపూర్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. దానితోపాటు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న నేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.