బ్రహ్మాస్త్ర కు బాయ్ కట్ బాలీవుడ్ ఎఫెక్ట్ తగులుతుందా?

Brahmastra is something beyond Boycott Bollywood,Brahmastra Versus Boycott Bollywood: What’s Really Happening Ahead Of Brahmastra’s Release?,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Brahmastra,Brahmastra Movie,Brahmastra Pan India Movie,Brahmastra Telugu Movie,Brahmastra Movie Latest Updates,Brahmastra Versus Boycott Bollywood,Latest Updates about Brahmastra,Brahmastra Movie Cast and Crew,Boycott Bollywood,Ayan Mukerji,Director Ayan Mukerji,Ayan Mukerji About Brahmastra Movie,Brahmastra Movie latest News,SS Rajamouli,Ace Director Director SS Rajamouli,SS Rajamouli Will Promote Brahmastra Movie in South,Brahmastra Releasing ion September 9th

ఒకవైపు ఎన్నో ఏళ్ల నుండి ఒక డైరెక్టర్ కంటున్న కల మరోవైపు బాయ్ కట్ అంటూ వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు.. ఇలాంటి నేపథ్యంలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా బ్రహ్మస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్- ఆలియా భట్ జంటగా నటించిన విజువల్ గ్రాండియర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాలుగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ పార్ట్ వన్ ను సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. అయితే మరోవైపు ఈసినిమాకు కూడా బాయ్ కట్ వివాదం అంటుకుంది. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఈసినిమా బాయ్ కట్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే పలు సినిమాలు బాయ్ కట్ కు బలైపోయాయి. ఎప్పటినుడో బాలీవుడ్ లో ఓ వర్గం బాయ్ కట్ అంటూ కొత్త ట్రెండ్ ను సెట్ చేశారు. అలా బాయ్ కట్ కు బలైన సినిమాల్లో సమ్ షేరా, ఎక్ విలన్ రిటర్న్స్, రక్షా బంధన్ రీసెంట్ వచ్చిన లాల్ సింగ్ చద్దా ఈసినిమాలన్నింటికి బాయ్ కట్ సెగ అంటుకొని బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. మరి ఈనేపథ్యంలో బ్రహ్మస్త్ర సినిమాకు ఈ ఎఫెక్ట్ ఎంతవరకూ తగులుతుంది అన్నది ప్రధానాంశంగా మారింది.

ఎందుకంటే సినిమాలో విషయం ఉంటే ఎంత బాయ్ కట్ అన్నా కూడా ఆ ప్రభావం సినిమాపై ఎక్కువగా పడే అవకాశం ఉండదు. బ్రహ్మాస్త్ర అనేది ఏదో రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమా కాదు.. ఈసినిమా కోసం డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడో.. ఎంత రీసెర్చ్ చేశాడో.. తనకు ఎక్కడి నుండి స్పూర్తి వచ్చిందో కూడా తెలియచేశాడు. అస్త్రాలకు అన్నింటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్ర ప్రాముఖ్యత.. ఆ అస్త్రాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించే దుష్టశక్తులు, ఆ శక్తుల నుండి బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు ప్రయత్నించే అస్త్రాలు.. ఇలా భారతీయ పురాణాలు, భారతీయ సంస్కృతిక మూలాల నేపథ్యంలో నుండి వచ్చిన కథ బ్రహ్మాస్త్ర. ఇలా ఈసినిమాను థియేటర్లలో చూడటానికి చాలా కారణాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతిని తెలియచేసే ఇలాంటి కథలకు బాయ్ కట్ ఎఫెక్ట్ తగలదనే ఆశిద్దాం..

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eighteen =