రణబీర్ కపూర్ ,అలియా భట్ జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా బ్రహ్మస్త్రం:మొదటి భాగం-శివ గత ఏడాది సెప్టెంబర్ 9న విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ చిత్రం ఒక్క హిందీలోనే కాదు తెలుగులోనూ మంచి వసూళ్లను దక్కించుకుంది. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున,డింపుల్ కపాడియా,మౌని రాయ్ కీలకపాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా సినిమాలో విఎఫ్ఎక్స్ కి ప్రశంసలు దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్స్ తెరకెక్కనున్నాయి.బ్రహ్మస్త్రం పార్ట్ 2మరియుపార్ట్ 3లను తెరకెక్కించనున్నట్లు అయాన్ ముఖర్జీ వెల్లడించాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా పార్ట్ 2 మరియు 3 ఒకేసారి షూట్ చేసి పార్ట్ 2ను 2026 డిసెంబర్ లో అలాగే పార్ట్ 3ని 2027డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. స్టార్ స్టూడియోస్ ,ధర్మ ప్రొడక్షన్స్ ,ప్రైమ్ ఫోకస్ ,అయాన్ ముఖర్జీ సంయుక్తంగా ఈ సినిమాలను నిర్మించనున్నారు.
ఇక అయాన్ ముఖర్జీ ఈసినిమాల తరువాత వార్ 2ను తెరకెక్కించనున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించనుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించనుంది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలబడనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: