వార్ 2 ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ

producer gnanavel raja about war 2 movie

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా వార్2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఈసినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. 2025 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి తమిళ్ నిర్మాత కే.ఈ జ్ఞానవేల్ మాట్లాడుతూ వార్2 ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్ఞానవేల్ సౌత్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా ముందడుగులో ఉంది.. ఇండియా వైడ్ గా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమా స్థాయి పెరిగిపోయింది.. ఈ స్థాయిని చేరుకోవడం హిందీ పరిశ్రమకు కాస్త ఛాలెంజ్ తో కూడుకున్న విషయమే.. కానీ హిందీ లో రాబోతున్న వార్ 2 మాత్రం ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అని అన్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ లాగా డిఫరెంట్ ఇండస్ట్రీస్ కు చెందినవారు నటించడం ఆడియన్స్ కు కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది.. కల్కి సినిమాలో అమితాబ్ నటించడం వల్ల ఆసినిమాకు మరింత వెయిట్ పెరిగింది.. ముందు ముందు ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలంటూ తెలిపారు జ్ఞానవేల్.

కాగా జ్ఞానవేల్ నిర్మాతగా రాబోతున్న మోస్ట్ అవైడెట్ సినిమాలు కంగువ, తంగలాన్ సినిమాలు. విక్రమ్ హీరోగా వస్తున్న తంగలాన్ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా వస్తుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.