మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘దేవర’. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తారక్ ముంబై పయనమై వెళ్లారు. అక్కడ పలువురు సెలబ్రీటీలను కలుసుకుంటున్నారు. సోమవారం ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాను కలుసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సందీప్ వంగాతో జూనియర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇది ప్రసారం కానున్నట్టు సమాచారం. అనంతరం మరికొందరు స్టార్ డైరెక్టర్స్‌ను కలిశారు ఎన్టీఆర్. దేవర దర్శకుడు కొరటాల శివతో కలిసి ‘సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ మరియు బాలీవుడ్ డైరెక్టర్ ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ లను కలుసుకున్నారు. అయితే వీరి డైరెక్షన్‌లో తారక్ తన తదుపరి ప్రాజెక్టులను చేయనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరు దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా దేవర చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. భైరా అనే ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్, చుట్టమల్లే, దావుడి సాంగ్స్‌కు, టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో నేటి సాయంత్రం దేవర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుండటంతో సినిమాపై మరింత హైప్ పెంచుతోంది.
ఈ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ హై యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈనెల 27న విడుదల చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: