బ్రహ్మాస్త్ర2, 3 ఆన్ ప్రోగ్రెస్

update on brahmastra part 2 and 3 working progress

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా మంచి హిట్ ను సాధించింది. అస్త్రావర్స్ అనే కాన్సెప్ట్ అస్త్రాలకు సంబంధించి హిస్టరీని చూపించారు. ఇక ఈసినిమా వచ్చి ఏడాది అయిపోయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈనేపథ్యంలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చివరిలో బ్రహ్మాస్త్ర 2, 3పార్ట్ లకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. బ్రహ్మాస్త్ర 2, 3పార్ట్ లకు సంబంధించిన డెవలప్ మెంట్ జరుగుతుందని అప్ డేట్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా  ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. బ్రహ్మాస్త్ర2-దేవ్ అండ్ అస్త్రావర్స్ నేపథ్యంలో రానుంది.

ఇదిలా ఉండగా పార్ట్ 2, పార్ట్ 3 లకు సంబంధించిన రిలీజ్ డేట్లను అయాన్ ఇప్పటికే చెప్పాడు.
పార్ట్ 2ను 2025 దీపావళి ఇక ఆతరువాత ఏడాదికి 2026 క్రిస్మస్ కి పార్ట్3 విడుదల చేస్తామని తెలిపాడు. మరి ఇవే డేట్లు ఉంటాయా? లేక ఫ్యూచర్ లో మరుతాయా అన్నది చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.