అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది కానీ ఇంతవరకూ రిలీజ్ మాత్రం కాలేకపోయింది. మధ్యలో కరోనా కూడా రావడం వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ రీసెంట్ గానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రణబీర్ కపూర్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. దానితోపాటు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న నేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇదివరకెన్నడూ లేని విధంగా 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్లతో గ్రాండ్‌గా ప్రమోట్ చేసే ప్లాన్ రెడీ చేశారు దర్శకనిర్మాతలు. మరోవైపు ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రయూనిట్ హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. అయితే ఈ ఈవెంట్ కు రాజమౌళి అతిథిగా రానున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా
చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లోకి ఈసినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: