అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన చిత్రం‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ ‘బ్రహ్మాస్త్రం- శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్స్ లో మాత్రం మేకర్స్ ఏ మాత్రం రాజీపడట్లేదు. ఉన్న టైమ్ ను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈసినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. కొత్త కొత్త విషయాలను తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా విజన్ ఏంటో అయాన్ ముఖర్జీ తెలియచేశాడు. అస్త్రాలు ఏంటి, వాటిలో బ్రహ్మాస్త్ర ప్రాముఖ్యత ఏంటీ.. పురాతన కాలం నుండి బ్రహ్మాస్త్రాన్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు అనే విషయాలను చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ బ్రహ్మాస్త్ర అంటూ మరో వీడియోను రిలీజ్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవీడియోలో ఈసినిమాకు బీజం ఎక్కడ పడిందో చెబుతున్నాడు అయాన్ ముఖర్జీ. అది 2011.. నా మొదటి సినిమా రిలీజ్ అయింది. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. అప్పుడు నేను సిమ్లా ట్రిప్ లో ఉన్నాను. అయితే అక్కడ హిమాలయాలు.. అక్కడ ఉన్న ఆధ్యాత్మికత ఫీలింగ్ నాపై చాలా ప్రభావాన్ని చూపించాయి. అక్కడ ఉన్న ఆధ్యాత్మిక ఎనర్జీ వల్లే బ్రహ్మాస్త్ర పుట్టిందని నేను ఫీల్ అవుతున్నాను. ఈసినిమా ఫాంటసీ సినిమా అయినా కూడా ఈసినిమా రూపకల్పనకు మాత్రం ఇండియన్ కల్చర్ ఇంకా స్పిరిట్చ్యూవాలిటీ అని చెబుతున్నాడు.
ఈసినిమా కోసం 10 ఏళ్లు సమయం వెచ్చించాను.. ఏ జవానీ హై దివానీ సినిమా రిలీజ్ అయినప్పుడు నా వయసు 29 సంవత్సరాలు ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ టైమ్ వచ్చేసరికి 39 సంవత్సరాలు. ఇంత టైమ్ పడుతుందని కూడా నేను అనుకోలేదు.. నేను ఊహించుకున్న విజన్ రియాల్టీగా మారడానికి 10 ఏళ్ల టైమ్ పట్టింది.. ఇలాంటి సినిమాకు అంత టైమ్ కూడా అవసరమే.. ఆడియన్స్ కు హై క్వాలిటీ తో పాటు వన్ టైమ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్ ను అందించాలంటే అంత టైమ్ తీసుకోవడం అవసరమే అని తెలిపాడు.
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: