కరోనా వల్ల ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆసినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. అలా చాలా రోజులపాటు పెండింగ్ లో ఉండి ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా బ్రహ్మాస్త్ర ఒకటి. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
ఇది రెండు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా రీసెంట్ గానే ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా తెలుగు మోషన్ పోస్టర్ కూడా నేడు రిలీజ్ అయింది. ‘ఈ లోకంలో ఏదో జరుగుతోంది. ఈ విషయం మామూలు మనుషులకు అర్థం కాదు. కొన్ని పురాతన శక్తులున్నాయి. కొన్ని అస్త్రాలున్నాయి’’ అనే రణ్‌బీర్ డైలాగ్‌లతోపాటు ‘‘అవన్నీ నీకు ఎందుకు కనిపిస్తున్నాయ్.. అసలు నువ్వు ఎవరు శివా.. అంటూ ఈ డైలాగ్స్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.
బ్రహ్మాండం యొక్క మహా శక్తివంతమైన అస్త్రం జాగృతమవుతుంది
ఒక మహాయోధుడు జన్మిస్తాడు!
Introducing ‘SHIVA’! 🔥Brahmāstra Part One: Shiva – Releases in Telugu in Cinemas on 09.09.2022https://t.co/M10cnzSpGl
________@SrBachchan #RanbirKapoor @aliaa08 @iamnagarjuna @Roymouni
— Dharma Productions (@DharmaMovies) December 18, 2021
కాగా ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా
చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లోకి ఈసినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: