యంగ్ టైగర్ ఎన్టీఆర్,వార్ 2తో బాలీవుడ్ లోకి వెళ్లనున్నాడని తెలిసిందే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయనున్నాడు.స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.త్వరలోనే అఫిషియల్ గా ఈసినిమా లాంచ్ కానుంది.ఈసినిమాలో ఎన్టీఆర్,హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నాడు.ఇక ఈసినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండనుందో హింట్ ఇచ్చేసాడు అయాన్ ముఖర్జీ.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అయాన్ ముఖర్జీ, వార్ 2 గురించి చెప్పుకొచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీఆర్ ఈసినిమాలో నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నాడట.ఇంతకుముందు ఎప్పుడు చూడని యాక్షన్ ఎపిసోడ్స్ వార్ 2లో ఉంటాయంట.ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాడని వెంటనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అయాన్ ముఖర్జీ తెలిపాడు.భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించనుంది.వచ్చే ఏడాది చివర్లో వార్ 2 థియేటర్లలోకి రానుంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరలో నటిస్తున్నాడు.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఈసినిమా షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తి చేసి ఎన్టీఆర్,వార్ 2 కి డేట్స్ కేటాయించనున్నాడు.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: