బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్లు ముందే ఫిక్స్

Ayan Mukerji Updates About Brahmastra 2 and 3, Ayan Mukerji Updates About Brahmastra 2, Ayan Mukerji Updates About Brahmastra 3, Brahmastra 2 and 3, Ayan Mukerji, Ranbir Kapoor, Alia Bhatt, Director Ayan Mukerji, Brahmastra, Brahmastra Telugu movie, Brahmastra New Update, Brahmastra Telugu Movie New Update, Brahmastra Movie, Brahmastra Latest Update, Brahmastra Movie Updates, Brahmastra Telugu Movie Live Updates, Brahmastra Telugu Movie Latest News, Brahmastra Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం కాస్త ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు. ఈసినిమా బాయ్ కట్ సెగను కూడా తట్టుకొని మంచి విజయాన్ని దక్కించుకుంది. నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా ఈసినిమా వెనుకాడలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా ఇప్పటికే 400 కోట్లకు పైగా సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నిజానికి ఈసినిమా అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాడు. అంతేకాదు ఎన్నో ఏళ్లు ఈసినిమా కోసం పలు రిఫరెన్స్ లు కూడా తీసుకొని కథను సిద్దం చేసుకున్నాడు. అయితే ఈ కథను ముందు ఒక సినిమాగా తీయాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఆ తరువాత ఒక్క సినిమాగా తీయడం కష్టం అనుకొని మూడు పార్ట్ లుగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఒక పార్ట్ రిలీజ్ చేశాడు.. ఇంకా రెండు పార్ట్ లు ఉన్నాయి. అందులో త్వరలో సెకండ్ పార్ట్ ను స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఈసినిమాను మూడు పార్ట్ లు అనుకున్నప్పుడే ఈసినిమా రిలీజ్ డేట్లు కూడా ఫిక్స్ చేసినట్టు తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అయాన్ ముఖర్జీ పార్ట్1 రిలీజ్ అయిన మూడేళ్లకి 2025 దీపావళి ఇక ఆతరువాత ఏడాదికి 2026 క్రిస్మస్ కి పార్ట్3 రిలీజ్ చేయాలని విడుదల చేస్తాం.. మ్యాగ్జిమమ్ ఇదే డేట్లలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం.. అప్పటి పరిస్థితులను బట్టి విడుదల తేదీలలో ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి.

కాగా  ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. బ్రహ్మాస్త్ర2-దేవ్ అండ్ అస్త్రావర్స్ నేపథ్యంలో రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 4 =