
ట్యాగ్ · 95 కథనాలు · పేజీ 4


'పుష్ప' ఒక్క షాట్ కోసం 12 గంటలు

అల్లు అర్జున్ పై అర్జున్ కపూర్ ప్రశంసలు

"పుష్ప" మూవీ న్యూ మేకింగ్ వీడియో రిలీజ్

'పుష్ప 2' పై బన్నీ క్లారిటీ
బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో 'పుష్ప'రాజ్ బిజీ

అల్లు అర్జున్ కు జోడీగా కీర్తి సురేష్ ?
బన్నీ-త్రివిక్రమ్ నాలుగో సినిమా..!
అల్లు అర్జున్ కు అభిమాని స్పెషల్ గిఫ్ట్
'ఐకాన్' ప్రారంభానికి సన్నాహాలు
అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా మరోసారి ?
"సౌత్ కా సుల్తాన్" అల్లు అర్జున్

అల్లు అర్జున్ గురించి హన్సిక ఒక్క మాటలో
కథా చర్చలలో "ఐకాన్ "
ఓ మై కడవులే రీమేక్ లో అతిథి పాత్రలో..!
బన్నీ చేతిలో మలయాళం హిట్ సినిమా హక్కులు
బన్నీ తో యానిమేషన్ సినిమా తీయాలి..!

'అల వైకుంఠపురములో'.. హిందీ డబ్బింగ్ రిలీజ్ లో ట్విస్ట్
సుకుమార్- బన్నీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా పుష్ప ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందే తెలిసిందే కదా. మొదటిసారి పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. మన తెలుగు ప్రేక్షకులకు బన్నీ సినిమాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇక పుష్పతో నార్త్ లో కూడా తన సత్తాను చాటాడు. ఇక ఇప్పుడు అదే క్రేజ్ ను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఈనేపథ్యంలో బన్నీ అల వైకుంఠపురములో సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈసినిమా రీమేక్ కూడా వస్తుంది బాలీవుడ్ లో. కానీ ముందే డబ్బింగ్ చేసి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది -నిధి అగర్వాల్
"సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి కథానాయికగా తెరకెక్కిన "హీరో "మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది.

"బుట్టబొమ్మ " సాంగ్ గురించి పూజాహెగ్డే
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

'పుష్ప' ఒక్క షాట్ కోసం 12 గంటలు
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప తో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈసినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకున్నందుకు బన్నీని ఇప్పటికే అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అన్ని పాటలు ఎంత హిట్ అయ్యాయో చూశాం. ఇక వీటిలో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట గుర్తుండే ఉంటుంది కదా. ఈ పాటలో బన్నీ ఒక్క షాట్ లోనే చాలా గెటప్స్ లలో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ షాట్ తీయడానికి చాలా కష్టపడ్డాడట బన్నీ. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి మరీ తెలిపింది.

అల్లు అర్జున్ పై అర్జున్ కపూర్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ బాలీవుడ్ లో 75 కోట్ల భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది . రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుత పెర్ఫార్మెన్స్ కు టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశంసలు…

"పుష్ప" మూవీ న్యూ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ…

'పుష్ప 2' పై బన్నీ క్లారిటీ
మొత్తానికి సుకుమార్-అల్లు అర్జున్ కూడా హ్యాట్రిక్ హిట్ ను కొట్టారు. ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 రాగా రీసెంట్ గా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసినిమాకోసం వీరిద్దరూ చాలా గ్యాపే తీసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా మాములుగా ఉండకూడదని డిసైడ్ అయి పుష్ప సినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమా మొదట ఒక సినిమానే అనుకున్నా తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకొని రీసెంట్ గానే ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈసినిమా…
బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో 'పుష్ప'రాజ్ బిజీ
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించడమే కాదు.. ఇప్పటి వరకూ ఎంత స్టైలిష్ లుక్ తో కనిపించాడో.. ఈసినిమాలో ఇంతకుముందెన్నడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నారు. ఈసినిమా ఇదే సగం క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక దానికి తోడు ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై మరింత ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆ అంచనాలను తారా స్థాయికి చేర్చింది.
చెన్నై లో" పుష్ప " మూవీ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అల్లు అర్జున్ కు జోడీగా కీర్తి సురేష్ ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ "పుష్ప : ది రైజ్" మూవీ డిసెంబర్ 17 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన "సరైనోడు "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బన్నీ-త్రివిక్రమ్ నాలుగో సినిమా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ మూడు సినిమాలు రాగా.. మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో వీరిద్దరిది బెస్ట్ కాంబినేషన్ గా నిలిచింది. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అయితే హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో చూశాం. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అంటే అభిమానులకు అది మంచి కిక్ ఇచ్చే న్యూసే అవుతుంది కదా. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి చక్కర్లు కొడుతుంది. దానికి కారణం ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీటే కారణం…
అల్లు అర్జున్ కు అభిమాని స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన డ్యాన్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తెలుగు చిత్ర పరిశ్రమలో కాకుండానే మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అశేష అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన మూవీస్ మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అక్కడి అభిమానులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ గా ముద్దుగా పిలుచుకుంటారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు.
'ఐకాన్' ప్రారంభానికి సన్నాహాలు
బన్నీ ఐకాన్.. ఈసినిమా ఇప్పటి వరకూ ప్రారంభంకాలేదు కానీ.. ఏదో ఒక వార్తలతో మాత్రం ఎప్పుడూ ఫోకస్ లోనే ఉంటుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకూ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఇక ఈమధ్య కాలంలో అయితే అసలు ఈసినిమా అల్లు అర్జున్ చేయట్లేదని.. ఆగిపోయిందని కూడా అనుకున్నారు అందరూ. వార్తలకు తగ్గట్టూ ఎవరూ స్పందించకపోవడంతో నిజంగానే సినిమా అటకెక్కిందేమో అనుకున్నారు. కానీ నిర్మాత బన్నీ వాసు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బన్నీ పుష్ప తరువాత ఈ సినిమానే చేస్తున్నాడు అని చెప్పడంతో క్లారిటీ వచ్చింది.
అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా మరోసారి ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 2 భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్" మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "ఐకాన్ "మూవీ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా పూజాహెగ్డే ని సంప్రదిస్తున్నట్టు సమాచారం.
"సౌత్ కా సుల్తాన్" అల్లు అర్జున్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అభిమానులు అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు. "పుష్ప "మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ గురించి హన్సిక ఒక్క మాటలో
దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హన్సిక. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 2007లో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక మొదటి సినిమాతోనే హన్సిక ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ఆతరువాత స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. కేవలం తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా హన్సిక వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే ఈమధ్య తెలుగులో కాస్త సినిమాలు తగ్గిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండా తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన హన్సిక పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తను మొదట నటించిన హీరో అల్లు అర్జున్ గురించి ఒక మాటలో చెప్పమని…
కథా చర్చలలో "ఐకాన్ "
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 2 భాగాలుగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయంతెలిసిందే . రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ "పుష్ప - ది రైజ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "పుష్ప - ది రైజ్ "మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఓ మై కడవులే రీమేక్ లో అతిథి పాత్రలో..!
ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కాకుండా విశ్వక్ సేన్ ఓ మై కడవులే సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా, అశ్వథ్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు.
బన్నీ చేతిలో మలయాళం హిట్ సినిమా హక్కులు
మన సినిమాలు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా రీమేక్ అవుతున్నాయి. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ఇక మన మేకర్స్ మలయాళంలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి చూస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా మలయాళం సినిమాలు రీమేక్ చేసుకుంటున్నాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్, లూసిఫర్, లవ్ మాక్ టైల్ ఇంకా చాలా సినిమాలే రీమేక్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన మరో సినిమా హక్కులు కూడా టాలీవుడ్ స్టార్ హీరో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్.
బన్నీ తో యానిమేషన్ సినిమా తీయాలి..!
ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో హీరోతో సినిమా చేయాలన్న ఆశ ఉంటుంది. అలానే హీరోలకు కూడా స్టార్ డైరెక్టర్ లతో చేయాలన్న కోరిక ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు.. ఎప్పటినుండో ఉన్న సంప్రదాయమే. ఇక ఇక్కడ ఒక డైరెక్టర్ కు యానిమేషన్ తరహా సినిమా చేయాలని.. అది కూడా ఓస్టార్ హీరోతో చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడట. ఇంతకీ ఆహీరో.. ఆ డైరెక్టర్ ఎవరంటే.. కామెడీ చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్ది కొత్తరకం కామెడీని అందించిన డైరెక్టర్ మారుతి. మారుతికి ఎప్పటినుండో హాలీవుడ్ లోని అల్లావుద్దీన్ తరహా యానిమేషన్ సినిమా చేయాలని ఉందట... అదికూడా స్టార్ హీరో అల్లు అర్జున్ తో. నిజానికి అల్లు అర్జున్ కు యానిమేషన్ సినిమాలు అంటే చాలా కష్టం…