ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన డ్యాన్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తెలుగు చిత్ర పరిశ్రమలో కాకుండానే మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అశేష అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన మూవీస్ మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అక్కడి అభిమానులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ గా ముద్దుగా పిలుచుకుంటారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలయాళ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగువాడైన అల్లు అర్జున్‌కు కూడా ఉందనడంలో సందేహం లేదు. మలయాళ ముఖ్యమంత్రి కేరళలో జరిగే పడవ ఉత్సవాలకు అల్లు అర్జున్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించగా అల్లు అర్జున్ హాజరు అయిన విషయం తెలిసిందే. మలయాళంలో ఇంత క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, ఓ మలయాళ అభిమాని ఓ గన్‌ను గిఫ్ట్ గా అందించారు. అల్లు అర్జున్ కొన్ని రోజుల ముందు యు.ఎ.ఈ కు వెళ్లిన సంగతి తెలిసిందే. దుబాయ్‌కు చెందిన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ అనే అభిమాని 160 సంవత్సరాల పురాతన గన్ ను అల్లు అర్జున్ కు గిఫ్ట్ గా అందించి సర్ ప్రైజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: