ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన “సరైనోడు “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ మూవీ లో కథానాయికగా కీర్తి సురేష్ ను సంప్రదించినట్టు , కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.కీర్తి ప్రస్తుతం “సర్కారు వారి పాట “మూవీ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి “భోళా శంకర్ ” మూవీ కి కూడా కీర్తి కమిట్ అయ్యారు. కొత్త కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: