కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Acharya Movie

ట్యాగ్ · 137 కథనాలు · పేజీ 6

షూటింగ్ అప్‌డేట్

'ఆచార్య' షూటింగ్ లో అప్పుడే

కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. 'ఆచార్య' చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిజానికి చిరు కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాలి కానీ చిరు కరోనా పాజిటివ్ అని ముందు రావడంతో మిగిలిన చిత్ర బృందం షూటింగ్ ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత మళ్లీ టెస్టింగ్ కిట్ లో లోపం ఉండటం వల్ల పాజిటివ్ వచ్చిందని.. కరోనా లేదని తెలిసిపోయింది. దీనితో నవంబర్ 20 వ తేదీ నుండి చిరంజీవి కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు సిద్ధం - చిరంజీవి

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా "ఆచార్య "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'చిరు' లేకుండానే 'ఆచార్య' షూటింగ్

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయింది. నిజానికి ఈ సినిమా షూట్ ను నిన్ననే ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఆశ్చర్యంగా నిన్ననే చిరు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి షాకిచ్చాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు కాజల్ గ్రీన్ సిగ్నల్

తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సినామికా "(తమిళ ), "ముంబై సాగా (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "క్వీన్ " మూవీ తమిళ రీమేక్ కాజల్ ప్రధాన పాత్రలో రూపొందిన "ప్యారిస్ ప్యారిస్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' కూడా రెడీ అవుతున్నాడు

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఇప్పటికే షూటింగ్ లు మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిఉన్న షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక అగ్ర హీరోల్లో నాగార్జున అయితే ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు . అది కూడా ఇక్కడ కాదు మనాలిలో ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూట్ లో వున్నారు. ఇక ఇప్పుడు చిరు కూడా సెట్స్ పైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కనుక లేకపోతే దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

చిరంజీవి రెడీ ఫర్ షూటింగ్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్..?

కొరటాల దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ఆచార్య సినిమా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రెండుమూడు రోజుల క్రితమే ఈ సినిమా కథపై ఆరోపణలు వచ్చాయి. వాటికి చిత్రయూనిట్, కొరటాల క్లారిటీ ఇచ్చారనుకోండి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేసింది రీసెంట్ గానే. ఓఇంటర్వ్యూ లో పాల్గొన్న రామ్ చరణ్ తాను ఈ సినిమాలో నటిస్తున్నట్టు.. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి కోరిక తీరుతున్నట్టు చెప్పాడు. ఇక ఇదిలా వుండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Director Koratala Siva Gets Serious On Plagiarism Rumors Surrounding His Acharya Movie Script
సినిమా వార్తలు

కొరటాల సీరియస్-ఇది నా కథ.. అందరికీ వినిపించాలా..!

కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై రాజేష్ అనే వ్యక్తి ఈ కథ నాదే అని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఆరోపణలపై చిత్రయూనిట్ స్పందించి క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా అతను చెప్పిన కథ నచ్చలేదు కాబట్టే మేము ఆ సినిమాను చేయలేదని వారు వివరణ ఇచ్చారు. దానికి.. దీనికి సంబంధం లేదని అన్నారు. ఇక ఇప్పుడు ఈవార్తలపై కొరటాల కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆచార్య‌’ ఒరిజిన‌ల్ క‌థ - అవన్నీ తప్పుడు కథలు

అప్పుడప్పుడు కొన్ని సినిమాలపై పలు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. పలానా కథలు మావి అంటూ.. పలు పాటలు మావి అంటూ ఆరోపణలు చేస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా ఆచార్య సినిమాకు కూడా ఆరోపణలువస్తున్నాయి. రాజేష్ అనే వ్యక్తి ఆచార్య కథ తనదంటూ ఆరోపణలు చేయడంతో ఆచార్య టీం దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Actor Ram Charan to fulfill his mothers dream with Megastar Chiranjeevi New Movie Acharya
సినిమా వార్తలు

ఈ సినిమాతో మాఅమ్మ కల నిజమవుతుంది

ఫైనల్లీ మా అమ్మ డ్రీమ్ ఇన్నేళ్లకు నెరవేరుతుంది అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ ఆ డ్రీమ్ ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. చిరు-రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని చిరు సతీమణి.. రామ్ చరణ్ తల్లి సురేఖకు ఎప్పటినుండో కోరికట. అది ఆచార్య సినిమాతో మొత్తానికి నిజమవుతుందని చెపుతున్నాడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'చిరు 152' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

చిరు పుట్టినరోజు కు ఇంకా నాలుగు రోజులు టైం ఉండగానే సోషల్ మీడియాలో అప్పుడే హంగామా మొదలైంది. ఇప్పటికే చిరు పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న ఆలోచనతో కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 65 మంది సినీ ప్రముఖులతో చిరు కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక కామన్ డీపీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య'లో చరణ్ ఎంట్రీ అప్పుడే..!

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం సినిమా మొదలైనప్పటినుండి వింటూనే వున్నాం. మధ్యలో కొంత మంది పేర్లు వినిపించినా.. చరణే ఫైనల్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'చిరు' సినిమాలో 'సోనూసూద్'..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే అది సోనూసూద్ పేరే. రీల్ లైఫ్ లో విలన్.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయిపోయాడు అందరికీ. కరోనా వల్ల ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచాడు. ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్లలో వారి స్వస్థలాలకు చేర్చారు. ఎంతో మంది పేదలకు సాయం చేసాడు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కుటుంబాలకు.. దాదాపు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానని కూడా చెప్పాడు. ఇక ఇటీవల రైతు కుటుంబానికి ట్రాక్ట‌ర్ ఇవ్వ‌డం, జాబ్ కోల్పోయిన మ‌హిళ‌కి ఉద్యోగం క‌ల్పించ‌డంతో అందరూ సోనూసూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు…

TFN Adminవాట్సాప్
Bollywood Actor Sanjay Dutt To Play The Antagonist Role In Mega Star Chiranjeevi Acharya Movie
సినిమా వార్తలు

'చిరు' తో ఢీ కొట్టనున్న 'అధీర'..?

చిరు సినిమా అంటే చాలు రోజుకో వార్త వస్తూనే ఉంటది. ఇక లూసిఫర్ సినిమాపై అయితే ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా లూసిఫర్ సినిమాల పాత్రల గురించి అయితే రోజుకో రూమర్ వస్తుంది. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు రెహ్మాన్ పోషించనున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో పేరు…

TFN Adminవాట్సాప్
Acharya Movie Makers Plans To Erect A Massive Temple Set For Shooting Purpose
షూటింగ్ అప్‌డేట్

"ఆచార్య " మూవీ కి భారీ టెంపుల్ సెట్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ కథానాయిక. కరోనా మహమ్మారి కారణం గా 4 నెలలు షూటింగ్ నిలిచిపోయిన "ఆచార్య " మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' ఆల్బమ్ పై మణిశర్మ క్రేజీ అప్ డేట్..!

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి టైటిల్ తప్పా ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ వచ్చింది లేదు. అప్ డేట్స్ ఇచ్చే లోపే కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాలు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నాలుగు నెలలు కనుక ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉండి ఉంటేదాదాపు షూటింగ్ ముగిసేదే. ఎలాగూ షూటింగ్ లు కూడా లేవు అప్ డేట్స్ కూడా లేకుండా పోయాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బడ్జెట్ తగ్గించే ప్లాన్ లో ఆచార్య..!

లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమకు బాగానే లాస్ వచ్చింది. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఆగిపోయాయి. దీనితో కొన్ని వేల కోట్లే నష్టం వచ్చింది. ఒకవేళ సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా కూడా బడ్జెట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో కొంతమంది దర్శక నిర్మాతలు ముందు భారీ బడ్జెట్ అనుకున్నా ఇప్పుడు తమ బడ్జెట్ ను తగ్గించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ నిర్మాతగా ఆయన నటిస్తున్న ఆచార్య మూవీ బడ్జెట్ కూడా తగ్గించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మొదటినుండి ఈ సినిమాకు కూడా చాలా ఆటంకాలే వచ్చాయి. ఇప్పటికే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు హర్ట్ .. 'ఆచార్య' ను ఆగష్ట్ కు వాయిదా..!

అదేంటి.. మెగాస్టార్ చిరంజీవి ఇంతకీ ఈ విషయంలో హర్ట్ అయ్యరబ్బా అనుకుంటున్నారా.. అసలుసంగతేంటంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మొన్న జరిగిన బాలయ్య వివాదం వలన చిరు బాగానే నోచుకున్నారట. షూటింగ్‌ల అనుమతుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చలపై బాలకృష్ణ స్పందించి.. నన్ను ఈ మీటింగ్స్‌కు ఎవరూ పిలవలేదు.. అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అంతేకాదు భూములు పంచుకుంటున్నారా అంటూ పలు సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇక ఈ వివాదంపై పలువురు పలు రకాలుగా స్పందించినా.. చిరు మాత్రం హర్ట్ అయ్యాడట. అందుకే ఇకపై షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్‌కు సంబంధించి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరోయిన్ రెజీనా ?

పలు హిట్ చిత్రాలలో నటించిన రెజీనా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రెజీనా నటించిన "ఎవరు" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రెజీనా ప్రస్తుతం 4 తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

Team TFNవాట్సాప్
సాంగ్

"ఆచార్య " మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్ ?

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు హీరోయిన్ రెజీనా పై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు "ఆచార్య " మూవీలో మరో స్పెషల్ సాంగ్ ఉందని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్