కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆచార్య ” మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. షూటింగ్స్ కు కొన్ని నియమ నిబంధనలతో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పలు మూవీస్ షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా తన యూనిట్ సభ్యులకు హాని కలగకూడదనే ఉద్దేశ్యం తో చిరంజీవి “ఆచార్య ” మూవీ షూటింగ్ పునః ప్రారంభించలేదు. 7నెలల తరువాత ఇప్పుడు చిరంజీవి షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇతర నటీనటులతో దర్శకుడు శివ కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నారు. నవంబర్ మూడవ వారంలో చిరంజీవి షూటింగ్ లో జాయిన్ అవుతారు. చిరంజీవి తో షూటింగ్ ప్రారంభం కాగానే రామ్ చరణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: