కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. ‘ఆచార్య’ చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిజానికి చిరు కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాలి కానీ చిరు కరోనా పాజిటివ్ అని ముందు రావడంతో మిగిలిన చిత్ర బృందం షూటింగ్ ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత మళ్లీ టెస్టింగ్ కిట్ లో లోపం ఉండటం వల్ల పాజిటివ్ వచ్చిందని.. కరోనా లేదని తెలిసిపోయింది. దీనితో నవంబర్ 20 వ తేదీ నుండి చిరంజీవి కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కాజల్ ఇప్పుడప్పుడే షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి లేదు. ఇన్ని రోజులు పెళ్లి పనులతో బిజీగా ఉన్న కాజల్.. ఇప్పడు ప్రస్తుతం ఇక్కడ లేదు. హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్ళింది ఈ భామ. ఇక అక్కడినుండి వచ్చిన తర్వాత డిసెంబర్ లో షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన అయితే లేదులే కానీ డిసెంబర్ 5వ తేదీ నుండి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాలో రామ్చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: