‘ఆచార్య’ కూడా రెడీ అవుతున్నాడు

Acharya Movie Team Gets Ready To Hit The Sets Post Lockdown

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఇప్పటికే షూటింగ్ లు మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిఉన్న షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక అగ్ర హీరోల్లో నాగార్జున అయితే ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు . అది కూడా ఇక్కడ కాదు మనాలిలో ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూట్ లో వున్నారు. ఇక ఇప్పుడు చిరు కూడా సెట్స్ పైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కనుక లేకపోతే దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మళ్లీ సెట్స్ పైకి వెళ్ళడానికి చిత్రయూనిట్ సిద్ధపడుతుంది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. కరోనా తర్వాత మళ్లీ తిరిగి సెట్స్ పైకి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.. కరోనా నిబంధనలు ప్రకారంనవంబర్ 9 నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నామని తెలిపారు.

కాగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 3 =