‘ఆచార్య’ ఆల్బమ్ పై మణిశర్మ క్రేజీ అప్ డేట్..!

Manisharma about Megastar Chiranjeevi's Acharya Movie

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ, మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి టైటిల్ తప్పా ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ వచ్చింది లేదు. అప్ డేట్స్ ఇచ్చే లోపే కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాలు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నాలుగు నెలలు కనుక ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉండి ఉంటేదాదాపు షూటింగ్ ముగిసేదే. ఎలాగూ షూటింగ్ లు కూడా లేవు అప్ డేట్స్ కూడా లేకుండా పోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మణిశర్మ క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఆచార్యలో ప్రతి ఒక్క పాట సిట్యుయేషన్ కు తగ్గినట్టే ఉంటుందని.. ఈ ఆల్బమ్ లో స్పెషల్ సాంగ్ ఒకటి.. ఇద్దరు హీరోలతో ఒక పాట, ఒక రొమాంటిక్ పాట, ఒక ఎమోషనల్ సాంగ్ ఇంకోటి డాన్స్ నెంబర్ అని తెలిపాడు.

కాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 15 =