‘ఆచార్య’లో చరణ్ ఎంట్రీ అప్పుడే..!

Director Koratala Siva Plans A Special Entry Scene For Ram Charan Tej In Acharya Movie

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం సినిమా మొదలైనప్పటినుండి వింటూనే వున్నాం. మధ్యలో కొంత మంది పేర్లు వినిపించినా.. చరణే ఫైనల్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్ పాత్ర 20 నిమిషాల పైన ఉంటుందన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో.. చరణ్ ఎంట్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉంటుందంట. యాక్షన్ అండ్ ఎమోషన్ గా సాగే చరణ్ ఎంట్రీ గూజ్ బంప్స్ తెప్పించేలా వుంటుందట. అంతేకాదు చిరు-చరణ్ కలిసి ఫైట్ సన్నివేశం.. ఇంకా చరణ్ కు ఒక సాంగ్ కూడా వుంటుందట. ఇంతకుముందు చూడని విధంగా చిరు-చరణ్ కాంబినేషన్ సీన్స్ ను ఓ రేంజ్ లో చూపించనున్నాడట కొరటాల. మరి ఆ సూపర్ కాంబినేషన్ ను చూడాలంటే మాత్రం సినిమా వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. చెర్రీ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానిని అనుకుంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నక్సలైట్ పాత్రలో చిరు నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =