కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా “ఆచార్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు హీరోయిన్ రెజీనా పై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు “ఆచార్య ” మూవీలో మరో స్పెషల్ సాంగ్ ఉందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




స్టార్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్ సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే అనసూయ “ఆచార్య ” మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో హీరో రామ్ చరణ్ తో ఆడి పాడనున్నారని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం” మూవీ లో రంగమ్మత్త గా అనసూయ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























